Take a fresh look at your lifestyle.

విద్యాశాఖకు జనసమికరణ బాధ్యతలు

16న సిఎం కెసిఆర్‌ ‌సభకు ఏర్పాట్లు
ఈ ‌నెల 16న హుజురాబాద్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ ‌బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జరగనున్న సభకు జనాన్ని సమికరించే బాధ్యతను ఉన్నతాధికారులు విద్యాశాఖకు అప్పగించారు. దీనికి సంబంధించి మండలాలు, గ్రామాల నుంచి జనాన్ని తీసుకురావాలని కరీంనగర్‌ ‌జిల్లా విద్యాధికారి మండల అధికారులను ఆదేశించారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవం, సీఎం బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి 10 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు గ్రామాల నుంచి జనం తరలింపుతో పాటు…సభను విజయవంతం చేసే అంశాలపై చర్చించేందుకు ఈ 10 మంది స్పెషల్‌ ఆఫీసర్లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

వీళ్లే కాకుండా సభ నిర్వహణ, జనాన్ని తీసుకొచ్చేందుకు 150 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. వీరిలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, రిసోర్స్ ‌పర్సన్స్ ఉన్నారు. ఐతే సీఎం సభ కోసం విద్యాశాఖకు బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కరోనాతో విద్యా సంస్థలు బంద్‌ అయ్యాయి. ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసులతో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. ఇలాంటి టైమ్‌ ‌లో ఎంఈఓలకు సీఎం సభ బాధ్యతలు, జన సమికరణ కోసం విద్యాశాఖ అధికారులు నియమించడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు విద్యావేత్తలు. సీఎం మిటింగ్‌ ‌కు ప్రభుత్వ కార్యక్రమంగానే నిర్వహిస్తున్నా…. భారీగా జన సమికరణకు ఏర్పాట్లు చేస్తుండడం చూస్తుంటే పొలిటికల్‌ ‌మిటింగ్‌ ‌తరహాలో ఉందని అంటున్నారు విద్యావేత్తలు.

Leave a Reply