- ఒక్కసారి వాడినివి మళ్లీమళ్లీ వాడరాదు
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
కొరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో మాస్క్లు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే కచ్చితంగా మాస్క్లు వాడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వైరస్ సోకినా చాలా మందికి లక్షణాలు కనబడవని, అలాంటివారు కరోనా వైరస్ను వ్యాప్తి చేసే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. వైరస్ సోకకుండా రక్షణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఇతరు నుంచి వ్యాధి సంక్రమించకుండా ఉండాలంటే మాస్కులు తప్పనిసరని పేర్కొంది.
ఆఫీసులు, పని చేసే ప్రాంతాల్లో తప్పనిసరిగా మాస్క్లు ఉపయోగించాలని, రెండు పొరలు ఉన్న కాటన్ వస్త్రాన్ని కూడా వాడొచ్చని ప్రభుత్వం చెబుతోంది. గ్రాణ ప్రాంతాల్లోనూ ప్రజలు మాస్క్లు వాడాలని, మూతి, ముక్కు, గడ్డం పూర్తిగా కప్పేలా మాస్క్ ధరించాలని అధికారులు పేర్కొన్నారు. చేతులు కడుక్కోని మాస్క్ వేసుకోవాలని, మాస్క్లు ఒకసారే వినియోగించాలని, వాషబుల్ మాస్క్లు ధరించడం మేలని ప్రభుత్వం సూచిస్తోంది. వాడిన మాస్కులను మూతవున్న చెత్తబుట్టలో వేసి చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. ఇప్టపి వరకు కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.