Take a fresh look at your lifestyle.

మాస్కులపట్ల జాగ్రత్త అవసరం

“మాస్కు వినియోగం, భద్రపరచటం వంటి విషయాలలో తగిన అవగాహన కొరవడిన వారు ఇతరుల భయానికి కారణ మవుతున్నారు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో చెవులకు తగిలించుకున్న మాస్కు గాలి వేగానికి తొలగి కిందపడిపోతున్నా చాలామంది గమనించటం లేదు..కొందరు గుర్తించినప్పటికీ వాహనాన్ని వెనక్కు తిప్పుకొని వెళ్లి తెచ్చుకునేందుకు ప్రాధాన్యమివ్వటం లేదు..ఇంకొందరు ఒకరోజు ఉపయోగించి ఎక్కడపడితే అక్కడ విసిరేస్తున్నారు.

గత రెండు మూడు నెలలుగా రోడ్లపై కొత్త చెత్త పోగవుతోంది.. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్‌ ‌కవర్లు తదితర వ్యర్థాలతోపాటు దార్ల వెంట ఫేస్‌ ‌మాస్కులు దర్శణమిస్తున్నాయి..
మాస్కులను ఉపయోగించటమే కాదు వాటిని జాగ్రత్త చేయటంలో కొందరి నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది.. గతంలో చేతి రుమాలు కిందపడితే కొద్ది దూరం వెనక్కు వెళ్ళాల్సొచ్చినా సరే వెళ్ళి దానిని తిరిగి తీసుకొనేవాళ్ళం.. అంటిన దుమ్ము దులిపి వినియోగించుకునే వాళ్ళం.. కానీ ఇప్పుడు మాస్కులుగా పిలుస్తున్న, ఉపయోగిస్తున్న గుడ్డలకు ఆమాత్రం విలువివ్వటం లేదు.. తక్కువ ఖరీదు తొడుగులు కావటం వల్లనో, కొన్నవి కాకపోవటాన్నో , మాస్కులకు విలువివ్వటంలేదు.. పోతే పోనీయ్‌ అనుకొనే ధోరణి వల్ల పోగొట్తుకున్నవారు నష్టపోయేది ఉన్నా లేకపోయినా ఇతరులు కరోనా పురుగు కాటుకు బలయ్యే దుస్థితి ఉంది.. నిర్లక్ష్యాన పారేసినవో, ఏమరుపాటుతో పోగొట్టుకున్నవైనా రోడ్లపై అక్కడక్కడా కనిపిస్తున్న మాస్కులు కరోనా వ్యాప్తి భయాన్ని కలిగిస్తున్నాయి.. రోడ్లపై నే కాక కాలువలు, చెత్త దిబ్బల్లోనూ పేరుకుపోతున్న మాస్కులు వైరస్‌ ‌వ్యాప్తి కారకాలయ్యే అవకాశముంది.. మాస్కుల భధ్రతపై భరోసాతోనే ప్రభుత్వం లాక్డవున్‌ సడలింపులనిచ్చింది.. మాస్కులు ధరించి కరోనా వైరస్‌ ‌నుండి రక్షణ పొందాలని సూచించింది..కానీ ఈ మాస్కుల వినియోగంలో నిబంధనలు పాటించని కారణంగా వైరస్‌ ‌మహమ్మారి కోరలు సాచే ప్రమాదముంది.

మాస్కు వినియోగం, భద్రపరచటం వంటి విషయాలలో తగిన అవగాహన కొరవడిన వారు ఇతరుల భయానికి కారణ మవుతున్నారు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో చెవులకు తగిలి ంచుకున్న మాస్కు గాలి వేగానికి తొలగి కిందపడి పోతున్నా చాలామంది గమనించటం లేదు..కొందరు గుర్తించినప్పటికీ వాహనాన్ని వెనక్కు తిప్పుకొని వెళ్లి తెచ్చుకునేందుకు ప్రాధాన్య మివ్వటం లేదు.. ఇంకొందరు ఒకరోజు ఉపయోగించి ఎక్కడపడితే అక్కడ విసి• •స్తున్నారు..ఎన్‌ 95 ‌వంటి ఖరీదైన మాస్కు లు వినియోగించే వారికి వాటిని సం రక్షించుకునే ఆలోచన ఉంటుంది పొర పాటున ఎక్కడైనా పడితే వెతుక్కొని తెచ్చుకుంటారు   కానీ గుడ్డతో కుట్టినవి, ఒకరోజుకే పరిమితమయ్యే మెడికల్‌ ‌మాస్కుల వినియోగం వల్ల రోడ్లపై ఇవి ఎక్కడ పడితే అక్కడ పడి ఉంటున్నాయి..

రోడ్లపై పడి ఉండే మాస్కుల్లో ఏవైనా కరోనా రోగులు ఉపయోగించినవైతే  నడిచి వెళ్ళేవారు వైరస్‌ ‌కు గురికాక తప్పదు.. మార్నింగ్‌ ‌వాక్‌, ఈవినింగ్‌ ‌వాక్‌ ‌లకు వెళ్ళోచ్చేవారు చూడక ఈమాస్కులపై అడుగేస్తే వైరస్‌ ‌ను అంటించుకోక తప్పదు.. మనుషులతోపాటు నోరులేని మూగ జీవాలు, వాటి ద్వారా మనుషులు కరోనా కాటుకు గురయ్యే పరిస్థితి ఉంది.. కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు , మేకలు, గొర్రెలు ఈ మాస్కులను తాకినప్పుడు వాటిల్లో వైరస్‌ ‌క్రిమి దాగి ఉంటే ఆయా జంతువులతోపాటు వాటి పెంపకం దార్లకూ వైరస్‌ ‌సంక్రమించక మానదు… మాస్కులను ధరిస్తున్న వారు మాస్కులను వాటి ధర పరంగా కాక వాటిని బాధ్యతా రహితాన పారేస్తుండటం వల్ల కలిగే దుష్ఫలితాలను ఊహించాలి..సమాజానికి మేలు చేయకున్నా ఫర్వాలేదు చేటు కలిగించే చేష్టలకు ఆస్కారమివ్వద్దు..ఇది మహమ్మారి కరోనా కాలం ప్రతి ఒక్కరిలో అప్రమత్తత అవసరం..మాస్కు వినియోగంలోనే కాదు వాటిని పారవేసే చర్యల్లోనూ నిబంధనలు పాటించాల్సిందే..

– కె.శ్రీనివాస్‌ ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్-9346611455

Leave a Reply