Take a fresh look at your lifestyle.

మాస్కు, భౌతిక దూరం మాత్రమే రక్షిస్తాయి

  • వైరస్‌ ‌కొత్తరూపుతో అప్రమత్తంగా ఉండాల్సిందే
  • ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా

కొత్తగా పుట్టుకొస్తున్న కొరోనా వైరస్‌ ‌వేరియంట్లను ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఎయిమ్స్ ‌డైరెక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా కీలక సూచన చేశారు. వైరస్‌ ‌రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, ఏ వేరియంట్‌ ‌బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. అలాగే టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు.

ఇంకా వైరస్‌ ‌వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని స్పష్టం చేశారు. కొరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్‌-19 ‌రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ రెండు డోసులు తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అసవరం లేదా? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో గులేరియా తాజా సూచనలు చేశారు.

Leave a Reply