Take a fresh look at your lifestyle.

మాస్క్ ‌లేకుంటే తప్పని జరిమాన

సూర్యాపేట, మే 12, ప్రజాతంత్ర ప్రతినిధి): మాస్క్ ‌లేకుండా ఏముందిలే రోడ్డుపైకి వెళ్లోద్దాం అనుకుంటే కరోనా ఏమోకాని జేబులు ఖాళీ కావడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 64జీఓ ప్రకారం మాస్క్ ‌లేకుండా కనిపిస్తే వేయ్యి రూపాయల జరిమాన వసులు చేయాలని ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా మాస్క్ ‌లేకుండా వాహనాలపై వెళ్లేవారిని పోలీసుల సహకారంతో మున్సిపాలిటీ సిబ్బంది 500 నుండి 1000రూపాయల వరకు జరిమాన విధిస్తున్నారు. లాక్‌డౌన్‌ ‌సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సడలించిన దుకాణాలలో మాస్క్‌లు ధరించి కొనుగోలు చేసే వారు కూడా మాస్క్ ఉం‌టేనే వస్తువులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్న కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండంతో మున్సిపల్‌ ‌శాఖ, పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టిపై పెట్టి సామాజిక, భౌతిక దూరం పాటించని, లాక్‌డౌన్‌ ఉల్లంఘన చట్టం క్రింద బారి జరిమానలు వసూలు చేస్తున్నారు.

ఇటీవల అనుమతులు లేకుండా మధు గార్మెంట్స్ ‌తెరవడంతో 5వేల జరిమాన విధించారు. సూర్యాపేట జిల్లాలో 83కేసులు పాజిటివ్‌గా రాగా అప్రమత్త మైన అధికారులు కరోనాను నియంత్రించడానికి పకడ్బందీగా చర్యలు చేపట్టాడు. దానిలో భాగంగా గత 20రోజుల నుండి ఒక్క పాజిటివ్‌ ‌కేసు నమోదు కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మద్యం దుకాణాలు, మందుల దుకాణాలు, భవన నిర్మాణం, ఆసుపత్రులు, నిత్యావసరం, అత్యవసరాల కొరకు అనుమతులు ఇవ్వడంతో ప్రజలు ఎప్పటిలాగానే రోడ్లపైకి ఎక్కువగా వస్తున్నారు.

Leave a Reply