Take a fresh look at your lifestyle.

మారుతీరావు ఆస్తులు రూ. 200 కోట్లు..!

  • ప్రణయ్‌ ‌హత్య కేసు విచారణ 23కు వాయిదా
  • ఛార్జీషీటు దాఖలు చేసిన నల్లగొండ పోలీసులు
  • మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు వివరణ

ప్రణయ్‌ ‌హత్య కేసులో ప్రధాన నిందితుడైన మారుతీరావు ఆస్తుల చిట్టా బయటికొస్తున్నది. మార్కెట్‌ ‌విలువ ప్రకారం ఆయన ఆస్తులు రూ.200 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొదట మారుతీరావు కిరోసిన్‌ ‌డీలర్‌ ‌వ్యాపారం చేశాడు. తర్వాత రైస్‌ ‌మిల్లుల బిజినెస్‌.. అనంతరం వాటిని అమ్మి రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారంలోకి దిగాడు. శరణ్య గ్రీన్‌ ‌హోమ్స్ ‌పేరుతో వంద విల్లాలు విక్రయించాడు. ఆయనకు హైదరాబాద్‌లో పలుచోట్ల ఐదు ప్లాట్స్, ‌మిర్యాలగూడలో ఓ షాపింగ్‌ ‌మాల్‌, ఈదులగూడెంలో మరో షాపింగ్‌మాల్‌ ఉన్నాయి. మారుతీరావు పేరు ద రెండంతస్తుల షాపింగ్‌ ‌కాంప్లెక్స్, ‌మిర్యాలగూడ బైపాస్‌లో 22 కుంటల భూమి ఉంది. మిర్యాలగూడలో సర్వే నెం.756లో ఎకరం 2 కుంటల భూమి, సర్వే నెం.457లో 7 కుంటల భూమి ఉన్నట్లు సమాచారం. అంతేకాదు..మారుతీరావుకు దామరచర్లలో 20 ఎకరాల పట్టా భూమి, బంధమ్‌, ‌తాళ్లగడ్డ, ఈదులగూడెం, షబానగర్‌, ‌బంగారుగడ్డలో ఆస్తులు, ఆయన పేరు ద 6 ఎకరాల 19 కుంటల భూమి, ఒక స్కూల్‌ ఉన్నాయని తెలిసింది. మారుతీరావు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.

- Advertisement -

హత్యకేసు విచారణ 23కు వాయిదా..
ప్రణయ్‌ ‌హత్యకేసు విచారణ ఈ నెల 23కి వాయిదా పడింది. నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ప్రణయ్‌ ‌హత్యకేసు విచారణ మంగళవారం జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుభాష్‌శర్మ, అస్గర్‌ అలీ, అహ్మద్‌ ‌భారీ, కరీం, శివ, నిజాంను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. అయితే మరో నిందితుడు మారుతీరావు సోదరుడు శ్రవణ్‌ ‌మాత్రం కోర్టుకు హాజరుకాలేదు. ఏ-1 నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.దీంతో తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. తన కుమార్తె అమృతను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకున్నాడని 2018 సెప్టెంబర్‌ 14‌వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ అనే యువకుడిని మారుతీరావు కిరాయి రౌడీలతో హత్య చేయించినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో 7 నెలలపాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన శనివారం రాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ కేసులో మారుతీరావు సహా 8 మంది నిందితుల పేర్లను పోలీసులు చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఏ-1 గా మారుతీరావు, ఏ-6గా ఆయన తమ్ముడును శ్రవణ్‌ను పేరును చేర్చి.. 102 మంది సాక్షులను విచారించిన ప•••్ణఱ•ఱ… అమృత- ప్రణయ్‌ల ప్రేమ మొదలు.. ప్రణయ్‌ ‌హత్య వరకు ప్రతీ అంశాన్ని1200 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రణయ్‌ ‌హత్య సమయంలో అతడి భార్య అమృత ఆరు పేజీల స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఆమెతో పాటు ప్రధాన నిందితుడు మారుతీరావు, శ్రవణ్‌, ‌ప్రణయ్‌ ‌తండ్రి బాలస్వామి తదితరులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ‌వివరాలు ఉన్నాయి.

Leave a Reply