రైతన్న రెక్కల కష్టం పై రాజ్యం కన్ను బడ్డది
కాకులను గొట్టి గద్దలకు బెట్టే
నల్ల చట్టాలతో నమ్మించి గొయ్యి తియ్యాలనే కుట్రల వ్యుహం బెడిసికొట్టింది.
దేశం గల్లీ మూలలనుండి బారులు తీరిన నాగటి కర్రులు ఢిల్లీ పీఠాన్ని కదిలించడానికి కవాతు జేస్తున్నయ్
విత్తనాలను పాదుకొల్పి పంటకు జీవంపోసే చెయ్యి
పరాధీనం కాకూడదని
పౌరుషాగ్నిని రగిలిస్తున్నయ్
గిట్టుబాటు ధరను కట్టబెట్టలేని
కట్టు కథలకు కాలం చెల్లిందని మట్టినిముద్దాడే చేతులు
మర్లబడుతున్నయ్
మట్టిపరిమళాల పొడ అంటని
కుహనా మేధావుల కుళ్ళు తర్కాన్ని ఎండగడుతున్నయ్
నల్లకుబేరులకు దాసోహమన్న
నటనా విన్యాసాన్ని
రాజధాని రంగస్థలంలో నగ్నంగా ఎత్తి పట్టినయ్
అధికారం బూజు దులిపె అస్త్రాలను చేతబట్టిన
అన్నదాతలు
సహనం రూపుదాల్చిన సమరశీల పోరాటాలకు సంకేతమయ్యిండ్లు
– గన్ రెడ్డి ఆది రెడ్డి, 9494789731