సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం
సోమవారం విచారణ తరవాత చూద్దామన్న హైకోర్టు
: స్వస్తిక్ గుర్తుతో పాటు ఏ గుర్తు ఉన్నా అంగీకరించాలన్న ఇసి నిర్ణయంపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని ఇసికి హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం..సింగిల్జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరెడ్మెట్లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలపగా, అందుకు సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది.
సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. ఇందుకు గాను సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్లో ఇతర ముద్రల వోట్లకు సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి …సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.