Take a fresh look at your lifestyle.

జగదేవ్‌పూర్‌ ‌మండలానికి…మార్కెట్‌ ‌యార్డు కేటాయించాలి

Market yard should be allocated in Jagadevpur mandal
మంత్రి హరీష్‌రావును కలిసిన టిఆర్‌ఎస్‌ ‌నేత రంగారెడ్డి
స్థలాన్ని సేకరించి అప్పగించాల్సిందిగా గజ్వేల్‌ ఆర్డీవోకు మంత్రి ఆదేశం

సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ ‌మండలంలో నూతన వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డు(ఏఎంసి)ఏర్పాటుకు సంబంధించిన పనులు చకచక జరుగుతున్నాయి. జగదేవ్‌పూర్‌ ‌మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి కృషితో…రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవ మూలంగా జగదేవ్‌పూర్‌లో నూతన వ్యవసాయ మార్కెట్‌ ‌యార్డుకు ఏర్పాటుకు సంబంధించి పనులు యుద్ధప్రాతిపదికన అధికారులు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం జగదేవ్‌పూర్‌ ‌మండల టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధ్యక్షుడు గూండా రంగారెడ్డి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కలిశారు. జగదేవ్‌పూర్‌ ‌మండలానికి మార్కెట్‌ ‌యార్డును తొందరగా కేటాయించి జగదేవపూర్‌ ‌రైతులకు అందించాలని కోరారు. రంగారెడ్డి విజ్ఞప్తి పట్ల మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించడమే కాకుండా..యార్డుకు కావల్సిన స్థలాన్ని సేకరించి అప్పగించాల్సిందిగా గజ్వేల్‌ ఆర్డీవోను ఆదేశించారు. మంత్రిని కలిసిన వారిలో జగదేవ్‌పూర్‌ ‌మండల టిఆర్‌ఎస్‌ ‌నాయకులు పైతర నర్సింహ రెడ్డి, ఆలేటి సంతోష్‌ ‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉంటే, జగదేవ్‌పూర్‌లో కొత్త మార్కెట్‌ ‌యార్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి హరీష్‌ ‌రావుకు జగదేవ్‌పూర్‌ ‌మండల టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయగా…జగదేవ్‌పూర్‌లో నూతన మార్కెట్‌ ‌యార్డు నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించాలని మార్కెటింగ్‌ ‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మండలంలోని గొల్లపల్లిలో గల సర్వే నంబర్‌ 49‌లోని 11 ఎకరాల భూమిని పరిశీలించారు. అలాగే పీర్లపల్లి పరిధిలోగల 66 సర్వేనెంబర్‌లోని 20 ఎకరాల భూమిని కూడా పరిశీలించారు.గొల్లపల్లి, పీర్లపల్లి గ్రామాలలో చేసిన స్థల పరిశీలనకు సంబంధించి ప్రతిపాదనలు మార్కెట్‌ ‌శాఖకు పంపించారు. తాజాగా…జగదేవ్‌పూర్‌లో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఏఎంసికి స్థలాన్ని సేకరించి అప్పగించాలంటూ మంత్రి హరీష్‌రావు ఆర్డీవోను ఆదేశించారు.

కబ్జాకు గురైన భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించండి మంత్రి హరీష్‌కు ధర్మారం సర్పంచ్‌ ‌వినతి
జగదేవ్‌పూర్‌ ‌మండలంలోని ధర్మారంలో ప్రభుత్వానికి చెందిన భూమిని కొందరు కబ్జా చేశారనీ, కబ్జాకు గురైన భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించాలని ధర్మారం సర్పంచి పిట్టల రాజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును కోరారు. ఈ మేరకు గురువారం సర్పంచి మంత్రి హరీష్‌ను కలిసి ఓ వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలోని 147, 148 సర్వే నెంబర్లలో 62ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు కబ్జా చేశారనీ, ఈ భూమిని గ్రామ పంచాయతీకి అప్పగించాలన్నారు. ఇదే సర్వే నెంబర్లలో 80ఎకరాల రైతులకు ఇచ్చిన అసైన్డ్ ‌భూమిని కూడా కొందరు కబ్జా చేశారన్నారు. రైతులకు పట్టా పాసు పుస్తకాలు కూడా ఉన్నాయనీ, ఈ భూమిని కూడా సర్వే చేయించి రైతులకు కబ్జా ఇప్పించాలని మంత్రి హరీష్‌రావుకు సర్పంచి రాజు విజ్ఞప్తి చేశారు.

Tags: minister harish rao, dharmaram sarpanch, jagadevpur, trs leader ranga reddy

Leave a Reply