Take a fresh look at your lifestyle.

మర్కజ్‌ ‌వెళ్లిన రోహింగ్యాలపై పోలీసుల దృష్టి

ఎవరైనా ఉంటే చెక్‌ ‌చేయించుకోవాలి
నగరంలో అక్రమంగా తిష్టవేసిన  రోహింగ్యాల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో 6040 మంది రోహింగ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్క రాచకొండ కమిషనరేట్‌ ‌పరిధిలోనే 5 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో వెయ్యి మందిని… సైబరాబాద్‌ ‌కమిషనరేట్‌ ‌పరిధిలో 40 మంది రోహ్యాంగాలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ ‌క్యాంపు నుంచి వెళ్లిన రోహింగ్యాల కుటుంబ సభ్యులు వివరాలను సైతం సేకరిస్తున్నారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్‌ ‌పరిధిలో ఉన్న రోహింగ్యాలకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. మర్కజ్‌ ‌యాత్రకు ఎవరైనా వెళ్లారా? వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చారా..? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా యాత్రకు వెళ్లిన వారు ఉంటే స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. ఈ మేరకు వారికి సమాచారం ఇచ్చారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!