Take a fresh look at your lifestyle.

డాక్ట‌ర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ లో మహిళా దినోత్సవం సందర్భంగా మారథాన్

డా. మర్రి చెన్నా రెడ్ది మానవ వనరుల అభివృద్ధి సంస్థలోని (డాక్ట‌ర్ ఎంసీఆర్ హెచ్ఆర్డీ)169వ ఇండక్షన్ కోర్స్ లో శిక్షణ పొందుతున్న ట్రెజరిస్ & అకౌంట్స్ డిపార్టుమెంటులో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్లు మరియు సీనియర్ అసిస్టెంట్లు మహిళా దినోత్సవం సందర్భంగా 5 కి.మీ. మినీ మారథాన్ పరుగులో సోమవారం ఉదయం కార్యాలయ ప్రాంగణంలో ఆ సంస్థ మహానిర్దేషకులు హరిప్రీత్ సింగ్, IAS, ఆదేశాల మేరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ అదనపు మహానిర్దేషకులు బెనహర్ మహేష్ దత్తు ఎక్క, IAS, శిక్షణ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మన సృష్టిలో మహిళల కీల‌క పాత్రను, విశిష్ట‌త‌ను గురించి వివ‌రించారు‌.

ఈ కార్య‌క్ర‌మాన్నిసంస్థ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ‌మ‌తి సావిత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్ లో ట్రెజరిస్ & అకౌంట్స్ డిపార్టుమెంటుకు చెందిన 44 శిక్షణ జూనియర్ అసిస్టెంట్లు మరియు సీనియర్ అసిస్టెంట్లను అభినందించారు. మరధాన్ లో గెలుపొందిన శిక్ష‌ణ‌లో ఉన్న మ‌హిళా అధికారుల‌కు ప‌త‌కాల‌ను బహుకరించారు. మార‌థాన్‌లో ఐశ్వ‌ర్య మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, త‌దుప‌రి రెండు స్థానాల‌ను శ్రీ‌మ‌తి మాస‌న‌, సుమ‌ల‌తలు గెలుచుకున్నారు. కార్యక్రమంలో కోర్స్ సమన్వయకర్త పి.వి.యస్. పతంజలి మరియు క్రీడా విభాగం సమన్వయకర్త డా.పెద్ద బోయిన శ్రీనివాస్ ఇతర ఆధ్యాపకులు సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply