Take a fresh look at your lifestyle.

టీఆరెస్ నేతను హత్య చేసిన మావోయిస్టులు…

ములుగు వెంకటాపురం మండలం ,ఆలుబాక గ్రామానికి చెందిన  టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వరరావు( బీసు) ను  మావోయిస్టులు హతమార్చారు. ఆదివారం.. అర్ధరాత్రి సాయుథులైన మావోయిస్టులు ఇంటికి వచ్చి మాట్లాడే పని ఉందన చెప్పి బలవంతంగా బయటకు తీసుకు వచ్చి కత్తితో  పొడిచి హత్య చేసారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులకు సహకరిస్తూ ప్రజల ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు అన్న ఆరోపణల పై  బిమేశ్వరావు  మావోయిస్టులు హత్య చేసినట్లు సమాచారం.
హత్య నేపథ్యంలో బిమేశ్వరావు కుటుంబం లో విషాదం లో నెలకొంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మావోయిస్టులను కాళ్లు పట్టుకుని బతిమిలాడినా వినకుండా తమ కళ్ళ ఎదుటనే అత్యంత దారుణంగా హత్య చేశారని తెలిపారు. మృత దేహం వద్ద లేఖను వదిలిన మావోయిస్టులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply