Take a fresh look at your lifestyle.

చత్తీస్‌గఢ్ లో సహాయక కానిస్టేబుల్ ని హత్య చేసిన మావోయిస్టులు

  • నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పేరుతో లేఖ

చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో స్వల్ప విరామం తరువాత మావోయిస్టులు అలజడి సృష్టించారు. ప్రతీకారేచ్చతో సహాయక కానిస్టేబుల్ ను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం బీజాపూరులో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఫర్సేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుర్సం రమేష్  సహాయక కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. రమేష్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు అదును చూసి అతన్ని అపహరించుకెళ్లి అతి దారుణంగా హత్యచేశారు.

ఫర్సేగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతం సమీపంలో రోడ్డు పక్కన రమేష్ మృతదేహాన్ని విడిచి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న ఫర్సేగఢ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అక్కడ మావోయిస్టులు “నేషనల్ పార్క్ ఏరియా కమిటీ” పేరుతో  లేఖను వదిలి వెళ్లారు. 2006లో రమేష్ సల్వజుడుంలో పని చేసినప్పటి నుంచి మావోయిస్టుల సమాచారాన్ని చేరవేసేవాడని, సల్వజుడుం అంతమయ్యాక ఎస్పీవోగా పనిచేసి, ప్రస్తుతం సహాయక కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడని అందుకే అదును చూసి రమేష్ ని హతమార్చినట్లు మావోయిస్టులు వదిలి వెళ్లిన లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply