Take a fresh look at your lifestyle.

ఈటల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారు

  • బిజెపిలో చేరికపై మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్‌ ‌లేఖ
  • ఆత్మగౌరవం కోసం కాదు..ఆస్తుల పరిరక్షణ కోసమేనన్న మావోయిస్టు నేత

మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌ఘాటు లేఖ విడుదల చేశారు. ఈటల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండించింది. ఈటల రాజేందర్‌ ‌తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను జగన్‌ ‌తప్పుబట్టారు. కేసీఆర్‌ ‌ఫ్యూడల్‌ ‌పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి పోరాడాలని ఈటల ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన అనంతరం హిందూత్వ పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారని జగన్‌ ‌పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్‌కు ఈటలకు మధ్య జరుగుతున్న పోరాటమని..

దీనితో తెలంగాణ ప్రజలకు సంబంధం లేదన్నారు. కేసీఆర్‌, ఈటల ఒకే గూటి పక్షులని జగన్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారంలోకి వొచ్చిందన్నారు. కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచారన్నారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైనదన్నారు. మొన్నటి వరకూ కేసీఆర్‌ ‌పక్కనే ఉండి అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు యత్నించారని జగన్‌ ‌విమర్శించారు.

అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించారన్నారు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బీజేపీలో చేరారన్నారు. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారన్నారు. మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసం అని ప్రజలకు తెలియజేస్తున్నామని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌ ‌పేర్కొన్నారు.

Leave a Reply