Take a fresh look at your lifestyle.

మావోయిస్టు కొరియర్‌ అరెస్ట్

‌భద్రాచలం పట్టణంలో గురువారం సాయంత్రం ఎస్సై మహేష్‌ ‌తన సిబ్బంది తో ఫుట్‌ ‌పెట్రోలింగ్‌ ‌చేయుచుండగా అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అతనిని పట్టుకొని  అతని వద్ద ఉన్న బ్యాగ్‌ ‌తనిఖీ చేయగా పేలుడు పదార్ధాలు ఉన్నట్లు భద్రాచలం ఎస్పీ రాజేష్‌ ‌చంద్ర తెలిపారు. శుక్రవారం లేఖలు తెలిపిన వివరాల ప్రకారం ఇతని  పేరు పడ్డం కళ్ళు చతీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లా పెద్ద గోలూర్‌ ‌గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు.

ఇతను సిపిఐ మావోయిస్టు భావజాలం నకు ఆకర్షితుడై మొదట బాలల సంఘం లో  చేరినాడు. ఈ క్రమం లో ఇతను పాపా రావు,  ఎస్‌జడ్‌సి మెంబర్‌, ‌నిషేదిత సిపిఐ మావోయిస్టు కు కొరియర్‌ ‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. ఇతను దళంనకు కావలసిన పేలుడు పదార్దాలు సరఫరా చేస్తూ, ఇతను  పాపారావు  ఆదేశాలు మేరకు ఖమ్మం నుండి పేలుడు పదార్దాలు డిటోనేటర్లు -150 మరియు  లిక్విడ్‌ ‌బూస్టర్స్ -2 ‌తీసుకొని వస్తుండగా ఇతనిని అంబేద్కర్‌ ‌సెంటర్‌ ‌లో పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌ ‌నిమిత్తం కోర్ట్ ‌కి పంపించడం జరిగిందని ఏఎస్పీ రాజేష్‌ ‌చంద్ర తెలిపారు.

Leave a Reply