విఆర్జి జవానుల బస్సు పేల్చివేత – ముగ్గురు జవానులు మృతి – ఐదుగురి పరిస్థితి విషమం
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా లో మావోయిస్టులు ఘుతుకానికి పాల్పడ్డారు. డిఆర్జి జవానులు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేసారు. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహించుటకు డిఆర్జి జవానులు బస్సులో ప్రయాణిస్తుండగా కడేనాత్ ,ఖర్నార్గావ్ వద్ద మావోయిస్టులు శక్తివంతమైన మందుపాతరను పేల్చివేసారు.
ఈ సంఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. మరికొంతమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని కూడ ప్రత్యేక హెలీక్యాఫ్టర్ ద్వారా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన మావోయిస్టుల కోసం పోలీస్ బలగాలు అడవి ప్రాంతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉన్న మావోయిస్టులు ఒక్కసారిగా పోలీస్ జవానులపై విరుచుకుపడ్డారు.
జవానుల వాహనాన్ని పసిగట్టి మందుపాతరను పేల్చటంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. మావోయిస్టు దుశ్చర్యను పోలీసు ఉన్నతాధికారులు మావోయిస్టులపై తీసుకునే చర్యపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది.