Take a fresh look at your lifestyle.

మన్యం బంద్‌ ‌వాల్‌ ‌పోస్టర్‌ ఆవిష్కరణ

ఈనెల 29 ఏజెన్సీ మన్యం బంద్‌ ‌వాల్‌ ‌పోస్టర్‌ ‌ను పినపాక నియోజకవర్గ ఆదివాసి సంఘాల జెఏసి గురువారం ఆవిష్కరిం చారు.ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులకు భంగం కల్పిస్తూ అమరజీవులు ఆదివాసీ నాయకులు కొమరం భీమ్‌ ‌లాంటి  అనేకమంది పోరాటం చేసి  ఆ పోరాటంలో వీరమరణం పొంది సాధించుకున్న ఆదివాసి చట్టాలను హక్కులను తూట్లు పొడిచి ఆదివాసు లకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివాసులు శాంతి మూర్తులని తమ కష్టాన్ని నమ్ముకుని జీవిస్తారు తప్ప ఇతరులపై ఆధార పడరని వారి హక్కులను హరించి వారి మనుగడకు భంగం కలిగిస్తే సహించరని ప్రాణాలకు తెగించి పోరాడుతారని హెచ్చరించారు. ఇకనైనా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వారికి అండగా ఉన్న 1/ 70 చట్టము ,1/ 59  చట్టాన్ని, అటవి హక్కుల చట్టాన్ని ,పీసా చట్టాన్ని పకడ్బందీగా అమలు పరిచి వారి హక్కులకు రక్షణ కల్పించాలని అన్నారు. లేకపోతే ఆదివాసుల తుడుం దెబ్బను సవిచూడవలసి వస్తుందని హెచ్చరించారు. చట్టాలను హక్కులను కాపాడాలని జీవో నెంబర్‌ ‌త్రీ మరల పునరుద్ధరించి ఏజెన్సీలో కొనసాగించాలని స్పెషల్‌ ‌డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, సెప్టెంబర్‌ 29 ‌నిర్వహిస్తున్న మన్యం బందును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శరం కోటేశ్వరరావు ,వట్టం నారాయణ ,కొమరం లక్ష్మణరావు, సింగా రవిబాబు, ఆలెం కోటి, పూణేమ్‌ ‌బాలకృష్ణ, కారం నాగేశ్వరరావు, కాటి బోయిన నాగేశ్వరరావు, వరుస శ్రీను, తంగోడి భద్రయ్య, వాగు బోయిన శ్రీను, కుంజా కృష్ణకుమారి, కొమరం రామ్మూర్తి ,పడిగనారాయణ, పాయం నరసింహారావు, మడి నరసింహారావు, మడి రమేష్‌, ‌కొమరం కాంతారావు, సర్ప సత్యం, కలబోయిన మాధవరావు ,పాయం దుర్గారావు ,పాండు గోపయ్య, కొమరం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply