Take a fresh look at your lifestyle.

నిముషం నిబంధనత వెనుదిరిగిన పలువురు విద్యార్థులు

మొదలైన ఇంటర్‌ ‌పరీక్షలు
తెలుగు రాష్టాల్ల్రో ఇంటర్‌ ‌పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిముషం నిబంధనతో విద్యార్థులు ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ముందురోజే సెంటర్లను గుర్తించడంతో పాటు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు లోనుకాలేదు. తెలంగాణలో ఇంటర్‌ ‌మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9.65లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో4.8 లక్షల మంది మొదటి సంవత్సరం పరీక్షలకు, 4.85లక్షల మంది ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్‌ ‌నుంచి హాల్‌టికెట్‌ ‌డౌన్‌లోడ్‌ ‌చేసుకునే వెసులుబాటు కల్పించారు. లొకేటర్‌ ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా పరీక్షా కేంద్రం తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంటర్‌ ‌పరీక్షల్లో నిమిషం నిబంధన కారణంగా పలువురు విద్యార్థులకు భంగపాటు తప్పలేదు. చిత్తూరు జిల్లా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. పిసిఆర్‌ ‌కాలేజ్‌ ‌వద్ద పరీక్షకు మూడు నిముషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని అధికారులు వెనక్కు పంపారు. విద్యార్థి ఎంతగా బతిమిలాడినా పరీక్షా హాల్‌లోకి అధికారులు అనుమతించలేదు. దీంతో ఆ అబ్బాయి కన్నీటిపర్యంతమయ్యాడు.

ఆర్టీసీ బస్‌లో రావడంతో లేటయ్యిందని బతిమిలాడుకున్నాడు. అధికారులు పరీక్షకు అనుమతించకపోవడంతో ఏడుస్తూనే వెనుదిరిగాడు. ఖమ్మం జిల్లా వైరా, పిఎస్‌డబ్ల్యుఆర్‌ఎస్‌ ‌పరీక్షల కేంద్రాలకు నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు వెనక్కు పంపారు. పెద్దపల్లి జిల్లా మంతలి ప్రభుత్వ బాలికల జూనియర్‌ ‌కాలేజీల వద్ద హాల్‌ ‌టిక్కెట్‌ ‌లేకుండా వచ్చిన ముగ్గురు విద్యార్థులను వెనక్కు పంపారు. మహేశ్వరం ప్రభుత్వ
జూనియర్‌ ‌పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అధికారులు పరీక్ష రాయనీయలేదు. కల్వకుర్తిలో 2 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని వెనక్కు పంపారు. వేములవాడలో ఆలస్యంగా వచ్చిన రాజేశ్వరి అనే విద్యార్థినిని పరీక్ష రాయనీయలేదు. షాద్‌నగర్‌లోనూ విద్యార్థిని ఇంటర్‌ అధికారులు వెనక్కు పంపారు.

నెలరోజులుగా ప్రచారం చేస్తున్నా విద్యార్థులు జాగ్రత్తలు తీసుకోలేదు. గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్న సూచనలను పలువురు పట్టించుకోలేదు. ఇదిలావుంటే ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లా ఇంటర్‌ ‌విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్‌ ‌రూమ్‌ ‌లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్‌ ‌బోర్డు వెబ్‌ ‌సైట్‌ ‌లో బిగ్‌ ఆర్‌ఎస్‌ ‌ద్వారా ఆన్‌ ‌లైన్‌ ‌లో ఫిర్యాదుల స్వీకరించనున్నారు. హైదరాబాద్‌ ఇం‌టర్‌ ‌బోర్డు కార్యాలయంలో కంట్రోల్‌ ‌రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ ‌రూమ్‌ ‌నంబర్‌ 040-24600110. ఈ ‌నెంబర్‌ ‌కు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్‌ ‌చేయొచ్చు. విద్యార్థులు ఒత్తిడికి లోనైతే 73372 25803 నంబర్‌ ‌కు ఫోన్‌ ‌చేయాలని సైకలాజిస్టులు సూచించారు.

ఇంటర్‌ ‌విద్యార్థులకు మంత్రుల శుభాకాంక్షలు
ఇంటర్‌ ‌విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్‌ ‌జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఉదయం స్థానిక బృంగి కళాశాల, సిద్దార్థ కళాశాల పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న విద్యార్థులను కలిశారు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న పలువురి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని తామున్నామంటూ ధైర్యం చెప్పారు. పరీక్షలు బాగా రాయల్సిందిగా సూచించారు.ఇంటర్మీడియట్‌ ‌పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు, గ్రేడ్‌లు ముఖ్యమే అయినప్పటికీ అవే జీవితం కాదన్నారు. ఒత్తిడికి గురికావద్దని పరీక్షలో ఉత్తమ ప్రదర్శన చూపాల్సిందిగా విద్యార్థులకు మంత్రి కేటీఆర్‌ ‌సూచించారు.

Leave a Reply