Take a fresh look at your lifestyle.

‌ప్రధాన కాలువ పనుల్లో పలుచోట్ల అసంపూర్తి పనులు

  • ఇరిగేషన్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్‌రావు
  • శుక్రవారం తొగుట మండలంలోని తుక్కాపూర్‌లో గల కాలేశ్వరం ప్రాజెక్టు
  • ప్యాకేజీ-12(మల్లన్నసాగర్‌)‌పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీష్‌రావు. 

ఇరిగేషన్‌ అధికారుల పని తీరుపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని సిద్ధిపేట అర్బన్‌, ‌రూరల్‌ ‌మండలాల్లోని తడ్కపల్లి, వెంకటాపూర్‌, ఇర్కోడ్‌, ‌తోర్నాల గ్రామాల మీదుగా ఉన్న ప్రధాన కాలువలో పలుచోట్ల అసంపూర్తి పనులపై ఇరిగేషన్‌ అధికారులపై మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు. తొగుట మండలంలోని తుక్కాపూర్‌, ‌పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాలువ పనులను కూడా పరిశీలించారు.

శుక్రవారం తొగుట మండలం తుక్కాపూర్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి మల్లన్న సాగర్‌ ‌ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాలువను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, సంబంధిత ఇరిగేషన్‌ అధికారులతో కలిసి మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన కాలువ దాదాపు 40 కిలో మీటర్ల మేర కాలువ ఉంటుంది. ఈ 40కిలో మీటర్లూ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని ఎంపి కొత్త ప్రభాకర్‌ ‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో మంత్రి హరీష్‌రావు పరిశీలించారు.

Leave a Reply