- తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయింది : గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
- నాయిని మరణం తీరని లోటు..దిగ్భ్రాతి వ్యక్తంచేసిన సిఎం కెసిఆర్
ప్రజాతంత్ర, హైదరాబాద్: దివంగత మాజీ హోంమత్రి నాయినికి పలువురు నేతలు నివాళి అర్పించారు. అనారోగ్యంతో ఆయన బుధవారం రాత్రి12.25 గంటలకు నగరంలోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో మృతిచెందినట్లు తెలిసి అభిమానులు తల్లడిల్లారు. రాజకీయపక్షాలు, ప్రజా, కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, సిఎం కెసిఆర్ నాయిని మృతి పట్ల సవతాపం ప్రకటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ఇతర పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ఓ గొప్ప నేతను కోల్పోయిందని అన్నారు.
తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయింది : గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతిపట్ల గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంతాపం ప్రకటించారు. నాయిని కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని చివరి శ్వాస వరకు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేశారని గవర్నర్ కొనియాడారు. తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయిందని తమిళిసై పేర్కొన్నారు.
నాయిని మరణం తీరని లోటు.. దిగ్భ్రాతి వ్యక్తంచేసిన సిఎం కెసిఆర్
నాయిని మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ సీఎస్‌ను ఆదేశించారు. నాయిని బుధవారం రాత్రి మృతి చెందినట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో నాయిని పాత్ర మరువలేనిది గుర్తుచేశారు. నాయిని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.