Take a fresh look at your lifestyle.

వాలంటీర్ల సేవలపై పలువురి ప్రశంసలు

మధిర, మే 9 (ప్రజాతంత్ర): ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి బారి నుండి మధిర మండలంను కాపాడుకోవటానికి తర్జనభర్జన పడుతున్న క్రమంలో పోలీస్‌మెన్‌ ‌కూడా తక్కువగా ఉండటంతో ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో ఖమ్మం కమీషనర్‌ ‌తప్పీర్‌ ఇక్బాల్‌, అడిషనల్‌ ‌డిసిపి మురళీ సూచనలతో వైరా ఎసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మధిర సిఐ వేణుమాధవ్‌ ఒక ఆలోచనకి రూపకల్పన చేశారు. అదే వాలంటీర్‌  ‌వ్యవస్థకు శ్రీకారం చుట్టారు సిఐ వేణుమాధవ్‌. ఈ ‌వాలంటీర్‌ ‌వ్యవస్థను ముందు కొంతమంది విమర్శించారు. అయితే సిఐ ఆదేశానుసారం ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌, ‌రూరల్‌ ఎస్‌ఐ ‌లవన్‌కు మార్‌ ఈ ‌వాలంటీర్‌ ‌వ్యవస్థను పటిష్టంగా అమల య్యేలా ముందుండి నడిపిస్తున్నారు.

అయితే వాలంటీర్ల పై విమర్శలు కాస్తా క్రమక్ర మంగా వాలంటీర్లు ఈ కరోనా కట్టడిని ఏ విధంగా సహాయపడ్డారో వాస్తవ రూపంలో చూస్తే కాని అర్ధం కాలేదు. మధిర మండలంలో ఉన్న యువత సిఐ వేణుమాధవ్‌ ‌పిలుపుతో స్వచ్ఛం దంగా ముందుకొచ్చి సుమారు వందమందికిపైగా వాలంటీర్లు సిఐ సూచనల ప్రకారం పనిచేసేందుకు సిద్దమయ్యారు. మధిర పట్టణంలోని రద్దీగాఉన్న ప్రాంతాల్లో వాలంటీర్లను నియమించి ప్రజల కు అవగాహన కల్పిస్తూ కూరగాయల మార్కెట్‌ ‌వద్ద, బ్యాంకులు, పెట్రోల్‌ ‌బంక్‌, ‌కిరాణా షాపుల వద్ద నిలువుకాళ్ళపై నిలబడి వాలంటీర్ల సేవలు నిజంగా అభినం దనీయం. సిఐ వేణుమాధవ్‌ ‌సూచ నలు తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజాసేవ కు అంకితమై కరోనా కట్టడిలో భాగస్వామ్యులై నిరంతరం పోరాటం చేస్తూ ముందుకు సాగు తున్న మధిర వాలంటీర్ల సేవలు అభినందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సేవలు ఎప్పటికి మర్చిపోనివి.. మరుపురా నివి… మధిర ఉన్నత కాలం ఈ కరోనా గుర్తు ఉన్నతకాలం మీసేవలు  నిలిచిపోతాయి.

Leave a Reply