నీటిలోనే బాధితులకు ఎమ్మెల్యే భూమన పరామర్శ
తిరుపతి, డిసెంబర్ 10 : తిరుపతిలో జోరువాన కారణంగా పలు కాలనీలునీటమునిగాయి. లక్ష్మీపురం సర్కిల్, రామానుజ సర్కిల్, జైభీం నగర్ కాలనీలో భారీ వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పర్యటించారు. మోకాళ్ళ లోతు వర్షం నీటిలో మునిగివున్నాను ఇళ్లలో బాధితులను పరామర్శించారు. 12వ డివిజన్ పరిధిలో వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు కమిషనర్ అనుపమ అంజలి పర్యటించారు. పుత్తూరు పట్టణంలోని రామానాయుడు కాలనీ వద్ద ఉన్న రైల్వే స్టేషన్ లోని ప్రహరీ గోడ గురువారం, శుక్రవారం, కురిసిన వర్షానికి శనివారం ఉదయం కుప్పకూలింది. బ్రిటిష్ కాలం నాటి నిర్మించిన ప్రహరీ గోడ కూలిపోవడానీ కాలనీ వాసులు తండోపతండాలుగా చూడ్డానికి వస్తున్నారు. హుటాహుటిన మున్సిపల్ కమిషనర్ కె.ఎల్.కె .రెడ్డి చైర్మన్ ఆనందగి గెడ్డం హరి, చైర్మన్ జయప్రకాష్ కౌన్సిలర్ చక్రి, అక్కడున్నవా కాలనీవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వర్షం సైతం లెక్కచేయకుండా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
సంఘటన స్థలానికి చేరుకొని. పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని రైల్వే అధికారులకు. తెలియజేసి మరమ్మతుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కోట మండలం శ్యామ సుందరపురం గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా కొప్పశెట్టి రామకృష్ణ అనే నిరుపేద పూరి గుడిసెలో నివసిస్తుండేవాడు. అయితే ఈ మాండూస్ తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వీచిన ఈదురు గాలులకు శుక్రవారం రాత్రి రెండు గంటల సమయంలో ఆ పూరి గుడిసె కుప్పు కూలింది. అయితే ఆ సమయంలో అతని భార్య బిడ్డలు ఊరికి పోవడంతో అతను ఒక్కడే ఆ గుడిసెలో ఉన్నాడు. డిసెపై కర్రలు విరుగుతున్న శబ్దం విని వెంటనే బయటికి పరుగులు తీశాడు. నిరాశ్రయుడు అయ్యాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని కుప్పశెట్టి రామకృష్ణ అధికారులను వేడుకొంటున్నాడు. నెల్లూరు జిల్లా సింగరాయకొండ మండలం ఊల్లపాలెం సముద్రతీరం వేటకు వెళ్లి మత్స్యకారులు చిక్కుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల మత్స్యకారులు సముద్రంలో ఉన్నామని చెప్పడంతో రెవిన్యూ పోలీస్ సముద్రం వద్దకు చేరుకున్నారు. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఏడుగురిని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు.