Take a fresh look at your lifestyle.

పదకొండేళ్ళు….!!

మానుకోట తిరుగుబాటు
వలసపాన పై పోరుబావుటా

ఈ ఘటనకు పదకొండేళ్ళు
వొడిశేలరాళ్ళయిన కంకర్రాళ్ళు

రైల్వేస్టేషన్‌  ‌కాడ  యుద్దకాండ
బుల్లెట్లను ఉరికించిన ఉద్యమజెండా

చేతికి అందిందే ఆయుధమయింది
గుండె ‘జై తెలంగాణ’ మై మోగింది

ప్రాణం తృణప్రాయంగా ఎంచిండ్లు
తూటాలకు ఎదురొడ్డి నిలిచిండ్లు

స్వపరిపాలనకై ఉద్యమశిఖరాగ్రహం
వలసపెత్తనం పై సబ్బండ జనాగ్రహం

చల్లే… అప్పుడు పుండుమీద కారం!!
తోక ముడిచే కదా…..కండకావరం!!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్టు, ప్రజాతంత్ర 

Leave a Reply