Take a fresh look at your lifestyle.

‌మనోజ్‌ ‌కుటుంబాన్ని ఆదుకోవాలి

కరోనా వైరస్‌ ‌నేపద్యంలో ప్రాణాలను ఫణంగా పెట్టి వృత్తిలో అంకితమై పనిచేస్తున్న జర్నలిస్టులకు అరోగ్య భద్రత కల్పించాలని, జర్నలిస్టుల సంక్షేమం కోసం ఓ అరోగ్య పాలసీని అందించాలని సిఎం కేసిఆర్‌ను కోరుతూ రాష్ట్ర పంచాయితీరాజ్‌ ‌మంత్రి ఎరబెల్లి దయాకర్‌రావుకు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. సోమవారం జగిత్యాల నర్సింగాపూర్‌లో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమ సమావేశంలో మంత్రి పాల్గోన్నారు. ఈసందర్బం గా హైదారాబాద్‌లో మీడియా జర్నలిస్టు మనోజ్‌ ‌కరోనా వైరస్‌ ‌బారినపడి మృతి చెందిన సంఘటనపట్ల జగిత్యాల పాత్రికేయులు సంతాపాన్ని వ్యక్త చేస్తు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌రవిల సమక్షంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడి మృతి చెందిన మనోజ్‌ ‌కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మనోజ్‌ ‌బార్యకు ప్రభుత్వపరంగా ఉద్యోగం కల్పించాలని, 50 లక్షల అర్థిక సహాయాన్ని అందించాలని మంత్రి దయాకర్‌రావును కోరారు. దీంతో మంత్రి దయాకర్‌రావు స్పందిస్తు ఈరోజు రాత్రికల్లా హైదరాబాద్‌కు చేరుకుంటానని, సిఎం కేసిఆర్‌తో స్వయంగా కలిసి జగిత్యాల పాత్రికేయులు తనకు ఇచ్చిన వినతిపత్రం అందజేస్తానని ఈసందర్బంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమములో జగిత్యాల పాత్రికేయులు ఉన్నారు.

Leave a Reply