Take a fresh look at your lifestyle.

మణిపూర్‌ ‌హైకోర్టు పరిధి దాటింది

ఒక తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎలా చెబుతారు
మణిపూర్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్పస్టీకరణ

న్యూదిల్లీ,మే9(ఆర్‌ఎన్‌ఎ): ‌షెడ్యూల్డ్ ‌తెగల జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మణిపూర్‌ ‌హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టుస్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పీఎస్‌ ‌నరసింహ, జస్టిస్జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మణిపులో జరుగుతున్న ఆందోళనలకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టిన సమయంలోఈ వ్యాఖ్యలు చేసింది. మణిపుర్‌లో హింసాత్మక ఘటనలకు సంబంధించి సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. మొదటిది మణిపుర్‌ ‌ట్రైబల్‌ ‌ఫోరమ్‌ ‌సిట్‌ ‌దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌, ఎస్టీ జాబితాలో మెయిటీ కమ్యూనిటీని చేర్చడాన్ని  పరిగణించాలని మణిపుర్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శాసనసభ హిల్‌ ఏరియాస్‌ ‌కమిటీ ఛైర్మన్‌ ‌డింగ్‌లింగ్‌  ‌గాంగ్‌ ‌మరో పిటిషన్‌ ‌దాఖలు చేశారు.

వీటిపై మంగలవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టి ఆ వ్యాఖ్యలు చేసింది. ఎస్టీ జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం హైకోర్టు పరిధిలోకి రాదని గ్యాంగ్‌  ‌కోర్టులో వాదించారు. ఎస్టీల జాబితాలో మెయిటీ కమ్యూనిటీని చేర్చాలనే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా మణిపుర్‌ ‌లో  హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.  రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడి, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణల్లో 19 మందికి పైగా గిరిజనులు మరణించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ ‌నిలిపేసి, కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply