Take a fresh look at your lifestyle.

ఇళ్ల కేటాయింపులో అవకతవకలు: ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

  • తెలంగాణ భవన్‌ ‌వద్ద ఖమ్మం మహిళల ఆందోళన
  • కేటీఆర్‌ ‌సమాధానం చెప్పాలి : ఎంపి రేవంత్‌ ‌రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ ‌బెఢ్రూం ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ఖమ్మం నియోజకవర్గానికి చెందిన మహిళలు తెలంగాణ భవన్‌ ‌వద్ద ఆందోళనకు దిగారు. శనివారం ఖమ్మం నియోజకవర్గానికి చెందిన దాదాపు 25 మంది మహిళలు ఇళ్లు ఉన్న వారికే తిరిగి డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు పొందుతున్నారనీ, దీంతో పేద మహిళలకు అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌నిలువ నీడ లేని నిరు పేదల కోసమే డబుల్‌ ‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే, ఖమ్మం నియోజకవర్గంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనీ, గతంలో డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు పొందిన వారే తిరిగి పేదలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో నమోదు చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేటాయించే ఇళ్ల పేరుతో కొందరు బ్రోకర్లు అమాయకుల వద్ద డబ్బులు సైతం వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్‌ను కలసి విన్నవిద్దామని తెలంగాణ భవన్‌కు వచ్చినట్లు తెలిపారు. అసలైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందినప్పుడే ప్రభుత్వ పథకాలతో లబ్ది చేకూరినట్లవుతుందనీ, అంతే కాని అనర్హులకే అవి అందితే ఎలా అని ప్రశ్నించారు. అయితే, సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ భవన్‌లో లేకపోవడంతో ఆయన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఆ మహిళలను అరెస్టు చేసి బంజారాహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు.

పట్టణ ప్రగతి పేరుతో మాయ మాటలు చెబుతున్న మంత్రి కేటీఆర్‌ ‌డబుల్‌ ‌బెడ్రూం ఇళ్ల సైట్ల వద్దకు రావాలని మల్కాజ్‌గిరి ఎంపి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అన్యాయం జరుగుతున్న మహిళలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్రం, నాబార్డ్ ‌నుంచి పేదల ఇళ్ల కోసం రూ.9000 కోట్ల నిధులు వచ్చాయనీ, అయితే బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు డబుల్‌ ‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను ఆపేశారని పేర్కొన్నారు. కిరాయి ఇళ్లల్లో పేదలు చనిపోతే ఇంటి యజమాని అనుమతించడం లేదనీ, అనాథ శవాల్లా రోడ్డుపైనే ఉంచాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తన మీటింగ్‌కు వెళితే ఇల్లు ఇవ్వమని అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. పేదలు ఓట్లేస్తేనే టీఆర్‌ఎస్‌ ‌నేతలకు నౌకరీలు వచ్చాయనీ, వాళ్ల ఓట్లతో గెలిచి వారినే బెదిరించే స్థాయికి టీఆర్‌ఎస్‌ ‌నేతలు వచ్చారని విమర్శించారు. పోరాడితే తప్ప డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు రావనీ, రాష్ట్రవ్యాప్తంగా పేదలకు నిర్మించి ఇస్తానన్న డబుల్‌ ‌బెడ్రూం ఇళ్లు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని ఈసందర్భంగా రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply