Take a fresh look at your lifestyle.

హోమ్ మినిస్టర్ ముట్టడించిన నేతలను రిమాండ్ కి తరలింపు

  • 68 మంది  కాంగ్రెస్ నేతలు అరెస్ట్ ను ఖండించిన ఇన్ ఛార్జ్ మణికం ఠాగూర్
  • బంగారు తెలంగాణ దక్షిణ యూపీ గా మారిపోతుంది.ఠాగూర్
  • హోం మంత్రి రాజీనామా చేయాలి సంపత్ కుమార్
  • A1 గా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు వెంకట్, A2  ఏఐసీసీ కార్యదర్శి  సంపత్ కుమార్, A 3  అనిల్ కుమార్ యాదవ్ 

రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ  ఇళ్లు ముట్టడించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.గురువారం మినిస్టర్ క్వాటర్స్  లోని హోమ్ మినిస్టర్ నివాసం ముందుకు చేరుకొని రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు ,హత్యలపై నిరసన తెలిపారు. హోం మినిస్టర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.తన మంత్రి పదవి కి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. తెలంగాణ లో శాంతి బత్రతలు పూర్తిగా క్షీణించాయని నేతలు మండిపడ్డారు..ఉత్తర్ ప్రదేశ్లో మారిదిగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి..దోషులకు ఉరి శిక్ష వేయాలన్నారు .బుధవారం కేసీఆర్ శాంతి భద్రాలపై సమీక్ష నిర్వహించారని రాష్ట్రంలో శాంతి రాష్ట్రం ఆదర్శంగా ఉన్నదని అన్నారు.కానీ కేసీఆర్ కు సిగ్గు ఉందా అని సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు .మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మీ టిఆర్ఎస్ నాయకుడే అత్యాచారం చేసి హత్య చేసి ఉరి వేస్కున్నట్టు చిత్రీకరించారని విమర్శించారు .

ఇది ఆదర్శంగా ఉందా..ఖమ్మంలో బాలికపై అత్యాచారం యత్నం చేసి పెట్రోల్ పోసి కాల్చారు, ఆ బిడ్డ చావు బతుకుల్లో ఉంది. ఒక్కరైనా పరమర్శించారా..అని నిలదీశారు .దోషులను కఠినంగా శిక్షించాలి. అప్పటి వరకు కాంగ్రెస్ ఉద్యమం ఆగదన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ,ఎన్ఎస్యూ ఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్ రావు , మైనారిటీ సెల్, ఎస్సి సెల్ కార్యకర్తలు ముట్టడించారు . దింతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ..మొత్తం 68 మంది కాంగ్రెస్ , ఎన్ ఎస్యూఐ, యూత్ కాంగ్రేస్ నేతల పై కేస్ నమోదు చేశారు పోలీసులు .దింట్లో  A1 గా ఎన్ ఎస్యూఐ  రాష్ట్ర అధ్యక్షుడు బాలమురి వెంకట్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ని A2 గా , యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ ని A3 గా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు .సెక్షన్ 147, 452, 332,353,506,504 , 341,149 సెక్షన్ ల కింద కేసు నమోదు .కొరోనా పరిక్షల అనంతరం రిమాండ్ కుతరలించనున్నారు పోలీసులు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply