Take a fresh look at your lifestyle.

‘‘మండి బజార్‌’’ ‌సాక్షిగా…ఈద్‌ ‌ముబారక్‌ !

“రంజాన్‌ ‌పండుగ ప్రత్యేకం ..
నగరం నడిబొడ్డున ఠీవీని చూపేటి వేపచెట్టు ఎందరికో కలుసుకునే ఓ సంకేత స్థలం. ఆ చెట్టు నీడన దర్గా..పక్కనే ఇరానీ చాయి! కులం,మతం లేని మానవ సమూహానికి ఆ చెట్టు సేదతీరే అడ్డా!. ఆ చెట్టు నీడన ఇరానీ చాయిని ఆస్వాదించటమే కాదు,అస్సమాలేకుమ్‌!‌వ్వాలేకుం అస్సలాం! అలాయ్‌ ‌బలాయ్‌ ‌ల ఆప్యాయతలను ఆస్వాదించని నగరజీవి వుండక పోవచ్చును. రంజాన్‌ ‌పండుగ పొద్దున స్నేహితుల ఇండ్ల నుంచి వచ్చేపండుగ ఖీర్‌,ఈద్‌ ‌ముబారక్‌ ‌చెప్పే అలాయ్‌ ‌బలాయ్‌ ‌లు పరిధులు లేని ఆనందాల్ని పంచే శోభాయమాన వీధులను మాయం చేసింది కొరోనా!”

గత సంవత్సరం..రంజాన్‌ ‌పండుగ సందర్భంగా మండి బజార్‌ ‌గుండెల మీద కరోనా చేసిన గాయం సంవత్సరం గడిచినా తడారలేదు. గత సంవత్సరం ఖచ్చితంగా ఇదే రంజాన్‌ ‌పండుగ ఉపవాస రోజులలో కొరోనా నియమాలనందరూ విధిగా పాటిస్తూన్నప్పటికినీ లాక్‌ ‌డౌన్‌ ‌ధాటికి మండి బజార్‌ ‌పండుగ శోభను కోల్పోయింది.పోయినేడు రంజాన్‌ ‌పండుగ సంబురాలు  కంటైన్‌ ‌మెంట్‌ ‌లో చిక్కి,చిన్నాభిన్నం కావడానికి కొరోనా ఒక్కటే కారణం కాకపోవచ్చునని,అష్టవక్ర అపోహలను ప్రసవించిన ఉన్మాదమేదో వుండివుండవచ్చుననే అనుమానాలు ఇంకా సమసిపోలేదు.దాని తాలూకు జ్ఞాపకాలింకా ప్రజలను విడిచిపోలేదు.

పొయిన సంవత్సరం రంజాన్‌ ‌పండుగ ముందు ఉపవాస దీక్షలు భయంభయంగానే కొనసాగుతున్నాయి.పరస్పరం పలుకరింపుల పక్కనుండి,అత్తరు పరిమళాల గుభాళింపుల మండి బజార్‌ ‌రోడ్డుకు అకస్మాత్తుగా అటూ ఇటు మేకులు దిగ కొట్టబడి,దారులు మూతబడ్డాయి.మూతబడ్డ దుకాణాలు షట్టర్లు శానిటైజర్‌ ‌స్నానాలతో గుప్పుమన్నాయి.వీధి దుకాణ దారులు చెల్లాచెదురయ్యారు.తబ్లీజ్‌ ‌యాత్రకు వెళ్ళొచ్చిన వారిలో మండిబజార్‌ ‌వాసులున్నారన్నారని, వారి వల్ల కొరోనా వ్యాపిస్తుందని ఒక అపోహ హఠాత్తుగా గుప్పుమన్నది.నగరం నడిబొడ్డున వున్న మండిబజార్‌ ‌కంటైన్‌ ‌మెంట్‌ ‌బంధీఖానా అయింది.రాత్రింబగళ్ళు కర్ఫ్యూను తలపించింది.రంజాన్‌ ‌పండుగ నెల రోజుల సంబురాల పై లాక్‌ ‌డౌన్‌ ఆం‌క్షలు ముసురుకున్నాయి.ఆరోపణలన్నీ అపోహలని తేలటానికి పెద్దగా సమయం పట్టలేదు కానీ, ఈలోగా పండుగ దాటెళ్ళిపోయింది.వందల యేళ్ళుగా మండి బజార్‌ ‌లో మత సమైక్యతకు ప్రతీకగా కన్నుల పండువగా జరిగే రంజాన్‌ ‌పై కక్ష కట్టిన కరోనా అపోహలు పండుగ సంబురాల్ని చిధ్రం చేశాయి.పండుగ ఆమ్మకాల కోసం చిన్నా చితకా దుకాణాలు పెట్టుకొని పండుగ పేరిట ఆ నెల రోజులు బతుకు వెళ్ళతీసుకునే చిరు వ్యాపారులు చితికి పోయారుు.

కమ్మని ఇరానీ చాయి లాంటి మండిబజార్‌…..
‌నగరం నడిబొడ్డున ఠీవీని చూపేటి వేపచెట్టు ఎందరికో కలుసుకునే ఓ సంకేత స్థలం. ఆ చెట్టు నీడన దర్గా..పక్కనే ఇరానీ చాయి! కులం,మతం లేని మానవ సమూహానికి ఆ చెట్టు సేదతీరే అడ్డా!. ఆ చెట్టు నీడన ఇరానీ చాయిని ఆస్వాదించటమే కాదు,అస్సమాలేకుమ్‌!‌వ్వాలేకుం అస్సలాం! అలాయ్‌ ‌బలాయ్‌ ‌ల ఆప్యాయతలను ఆస్వాదించని నగరజీవి వుండక పోవచ్చును. రంజాన్‌ ‌పండుగ పొద్దున  స్నేహితుల ఇండ్ల నుంచి వచ్చేపండుగ ఖీర్‌,ఈద్‌ ‌ముబారక్‌ ‌చెప్పే అలాయ్‌ ‌బలాయ్‌ ‌లు పరిధులు  లేని ఆనందాల్ని పంచే శోభాయమాన వీధులను మాయం చేసింది కొరోనా!
పగలు,రాత్రుల తేడాల్లేని  పండుగ షాపింగ్‌ ‌కు అడ్డా అది.రాత్రి వెలుగులు విరజిమ్మే విద్యుత్‌ ‌కాంతులలో మెరిసిపోవాల్సిన  మండి బజార్‌ ‌ప్రధాన దారులన్నింటిపై  చీకట్లను పరిచి నిర్మానుష్యం చేసింది కరోనా.అడుగడుగునా హలీం సెంటర్ల దగ్గర ఘుమఘుమలాడే కమ్మని వాసనల పక్కన హలీం తినాలనే ఆశ ఎన్ని  గంటలు వేచి వున్నా సంతోషమే అనిపించేది. పండుగ ముస్లీంలదని అనుకోవటమే కానీ హలీం సెంటర్ల  నుండి ఎక్కడ చూసినా హడావుడి అన్ని మతాల వాళ్ళది. నల్గురు దోస్తులు కలిసి ‘‘మండిబజార్‌ ‌ల హలీం,హరీస్‌ ‌తినేందుకు పోతున్నాం’’ అని చాలా గొప్పగా చెప్పుకునే ముచ్చట.ముస్లీంల ఏరియాలు ఎల్‌.‌బి.నగర్‌ ,‌చార్‌ ‌బౌలి,చమన్‌,‌చింతల్‌, ‌షేర్‌ ‌పురా,నిజాంపురా ప్రజలందరికి పండుగ షాపింగ్‌ ‌బజార్‌ ‌కు ప్రధాన అడ్డా మండి బజారే! చీకటి పడటంతో మొదలయ్యే దుకాణాల సందడి తెల్లావారేదాక లైట్ల వెలుగులతో కళకళలాడేవి.విదేశాలనుండి తెప్పించే అత్తరు దుకాణాలు వేప చెట్టును అనుకోని వున్న దర్గా వద్ద కొలువయ్యేది. సేమియాలు, పండుగ ఖీర్‌ ‌కోసం జీడిపప్పు, ఎండుద్రాక్ష, సారపప్పు దుకాండ్లు,బట్టల దుకాండ్లు,ఆడపిల్లల,చిన్న పిల్లల మేకప్‌ ‌సామాన్లు ఆట వస్తువులు,బట్టలు,చెప్పులు ఎన్ని దుకాణాలో.! రంజాన్‌  ఉపవాసాల నెల మొత్తం నగరానికి మండిబజార్‌ ‌రాజయ్యేది. సాయంత్రం మండిబజార్‌ ‌దారుల్లో బిరియానీ, హలీం వాసనలు నగరాన్ని ఆప్యాయతల కౌగిలిలో బంధించేది. దేశ విదేశాల నుండి దిగుమతయ్యే పండ్లు,అత్తరులు, పింగాణి వస్తువులు కొనేందుకు అన్ని మతాల వాళ్ళు బారులు తీరటం మస్తనిపిస్తుంది.ధనవంతులైన ముస్లీం కుటుంబాలు వేలాది పేద ముస్లీం కుటుంబాలకు బట్టలు,పండుగ సామాన్లు అందచేయటం పుణ్యకార్యంగ భావిస్తారు.మతభేదాలు లేకుండా నగరం లో ఇరానీచాయి ములాఖత్‌ ‌ల నిఖార్సయిన స్నేహ హస్తం మండి బజార్‌ ‌వేపచెట్టు అడ్డా! హైదరాబాద్‌ ‌తరువాత పది,ఇరవై పై రకాల పాన్‌ ‌లు దొరికే ఏకైక అడ్డా మండిబజార్‌. ‌యువకుల సాయంత్రాలను అలాయి బలాయి అలుముకునే ‘జాన్జిగర్‌ ‌దోస్త్’ ‌మండిబజార్‌.,

‌పండుగ నెల రోజుల సాయంత్రాలు హైదరాబాద్‌, ‌సుల్తాన్‌ ‌బజార్‌ను మరిపించే సామాన్యుల షాపింగ్‌ ‌మాల్‌ ‌ల సమాహారం మండిబజార్‌  ‌పోచమ్మ మైదాన్‌ ‌నుండి పాత లక్ష్మీ టాకీస్‌ ‌జంక్షన్‌ ‌వరకు రోడ్డుకు రెండు వైపులా వందల దుకాణాలు పొయినేడు ఇదే రోజులలో పండుగలో కనిపించకుండా పోయాయి.వందల సంవత్సరాల మండిబజార్‌ ‌పండుగ సంబురాల చిత్ర పటాన్ని చిధ్రంచేసింది కొరోనా. పండుగ పేరిట దుకాణాలు పెట్టుకోని నాలుగు పైసలు సంపాదించుకునే పుట్‌ ‌పాత్‌ ‌వ్యాపారులకు నిరాశే  మిగిలింది.

కాటేసిన కొరోనా విషం క్వారెంటైన్‌ ‌కాలం తరువాత పోయింది. కానీ కొరోనా పేరుతో ఒక వర్గం ప్రజల జీవనంపై సోషల్‌ ‌మీడియా గక్కిన కాలకూట విషం జీవిత కాలం మరచిపోకుండా మిగిలి పోయింది.కూరగాయలు, పండ్లమ్ముకునే తోపుడు బండ్ల వ్యాపారం చేసుకునే పేద బతుకులను దారుణంగా అనుమానించి, అవమానించింది. తీరా చూస్తే.తబ్లీజ్‌ ‌యాత్ర పేరిట నగరంలో క్వారెంటైన్‌ ‌బంధీలైన ఇరవై ఏడు మంది ముస్లీం సోదరులలో అందరికందరు నెగెటివ్‌ ‌రిపోర్టుతో డిస్చార్జీ అయ్యారని సాక్షాత్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌గారే ప్రకటించారు.
మతసామరస్యానికి ప్రతీక మండిబజార్‌.

ఆప్యాయతల అలాయి బలాయి నిష్కల్మషమైన స్నేహానికి కేరాఫ్‌ ‌మండి బజార్‌. ‌చాయి బిస్కెట్‌ ,‌బిరియాని ప్యారడైజ్‌ ‌స్వర్గం మండిబజార్‌. ఇరానీ చాయి తాగి ఇక్కడి వారి గుండెలపై గునపాలు దించిన విద్వేషాల కాలకూట విషం కూడా ఇక్కడ దర్గా పక్క పూల దుకాణం పరిమళాలకు పలుచనై  తలదించుకుంది.

ఐదారు వేలు దాటని తబ్లీజ్‌ ‌సమావేశాలు నాడు మనలను అంతగా భయపెట్టాయి.ఆ ప్రభావం మండీ బజార్‌ ‌ను బందీఖానా చేసింది.  ఈ యేడు కుంభమేలా, ఎన్నికలమేలా, ప్రచారాల మేలా  వాటి ప్రభావాలూ రెట్టింపు తీవ్రతతో కనిపించినా చర్యలేవి లేవు! కుంబమేలా  వెళ్ళి వచ్చిన భక్తులుండే ఉత్తరాది రాష్ట్రాలలో కొరోనా ప్రభావం  రెండవ వేవ్‌ ‌ప్రపంచ గణాంకాలను దాటి గగనాన చేరింది కదా! అక్కడికి వెళ్ళి  గంగలో మునిగిన వారందరూ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు తిరిగి వెళ్ళారు.అలా వెళ్ళి వచ్చిన వారిలో తొంబయి శాతం కేసులు పాజిటివ్‌ ‌లేనని అధికారిక వార్తలే తెలుపుతున్నాయి. వారిలో ప్రముఖులు,నేతలూ వున్నారు.సెకండ్‌ ‌వేవ్‌లో నాలుగు కోట్ల కొత్తకేసులు నమోదవుతుంటే ఇందుకుగాను బాధ్యులెవరో గుర్తించబడలేదు!. చరిత్రలో భారత్‌ ఇం‌త భయంకర విపత్తును మునుపెన్నడూ ఎదుర్కొన్న దాఖలా లేదు.ఆ రోజు తబ్లీజ్‌ ‌వెళ్ళిన వారిని వెదికి వెదికి మరీ వారి నివాస ప్రాంతాలను కంటైన్‌ ‌మెంట్లుగా మార్చిన సంఘటనలు మరవలేదు.ఈ యేడు కుంబమేలా  వెళ్ళి వచ్చిన కొరోనా వ్యాపకుల పట్ల చర్యలుండాలి కదా!? వారుండే ప్రాంతాలను కంటైన్‌ ‌మెంట్‌ ‌జోన్లుగా ఎందుకు ప్రకటించలేదు?
పొయినేడు కంటైన్‌ ‌మెంట్‌ ‌పేరిట  రంజాన్‌ ‌పండుగ ఆనందాలను కొరోనా మింగివేయచ్చు,కానీ కరడు గట్టిన విద్వేషాలు కసిగా కాటేసేందుకు విఫలయత్నం చేసాయి.ఆవి అవకాశం కోసం ఎప్పటికైనా పొంచి  వుంటాయ నేది నిజం.భిన్నమతాల,భిన్న భాషల,భిన్న సంస్కృతుల సమాహారమైన భారత రాజ్యాంగ సూత్రాలకు విరుద్దమైన ఆచరణల ఎల్లకాలం చెల్లబోవనేది జనసామాన్య అవగాహన  కావాలి.

పొయినేడు విద్వేషాల విధ్వంసపు పదఘట్టనల కింద రంజాన్‌ ‌పండుగ ఆనందాల్ని కోల్పోవచ్చు! సమైక్యత స్నేహ పరిమళాల పరిష్వంగాల ముందు విద్వేషాలు నిలబడేవి కావు! కమ్మని ఇరానీ చాయి సాక్షిగా మండిబజార్‌ ఇం‌కా ఎన్నేండ్లు గడిచినా ఐక్యతకు ‘‘ఐకాన్‌’’ ‌గనే కలకాలం నిలుస్తుంది.!
– ఎలమంద, తెలంగాణ

Leave a Reply