Take a fresh look at your lifestyle.

మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌భార్య ఆత్మహత్య

మంచిర్యాల (మందమర్రి), ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7  : మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌బాలకృష్ణ భార్య జ్యోతి  (32) మంగళవారం తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిరాలలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మంచిర్యాల మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌విధులు నిర్వహిస్తున్న నల్లమల బాలక్రిష్ణ తన కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఆదిత్య ఎంక్లేవ్‌ ‌లో ని శ్రీ గణం రెసిడెన్సిలో  నివాసం ఉంటున్నారు. భార్య భర్తలు తరచుగా గొడవ పడుతుంటారు. ఈ కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఆయన భార్య జ్యోతి మంగళవారం  తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని ఓ గదిలో ఆమె చున్నీతో ఫ్యాన్‌ ‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఆత్మహత్యకు ముందు భర్తకు మెసేజ్‌ ‌చేసినట్లు సమాచారం.

దీంతో డ్యూటీ లో ఉన్న బాలక్రిష్ణ ఉఠాహుటిన ఇంటికి వచ్చాడు. తలుపు లోపలినుంచి బెండు వేసి ఉండడంతో ఎంత పిలిచినా బయటికి రాకపోవడంతో తలుపు  పగులకోట్టి లోనికి వెళ్ళాడు. అప్పటి కే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది . మృతురాలు కు కూతురు భవిష్య (5) కొడుకు రిత్విక్‌ ‌చౌదరి (8) ఉన్నారు. డిసిపి,ఎసిపిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తల్లి మరణంతో పిల్లల రోధిస్తూ నాన్న అమ్మకు ఏమైంది అంటూ రోదించడం స్థానికులను కన్నీళ్లు పెట్టించాయి మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ‌నెల్కి సుగుణాకర్‌ ‌తెలిపారు.

Leave a Reply