Take a fresh look at your lifestyle.

మనలోని వాళ్ళు

పిలుపునిచ్చాం కదా
ప్రతిజ్ఞ చేసాం కదా
ఇలా కూర్చిండిపోతే ఎలా
అదుగో తెలతెలవారుతోంది
చైతన్య భేరీకి
కట్టలు తెంచుకుంటోంది
ఉడుకు ప్రవాహం
దేంతో నిమిత్తం లేకుండా!
ఒక అరుణోదయం కాకమునుపే
ఢంకా మ్రోగుతోంది
తలలు…
గొంతులు…
పిడికిళ్ళు…
అడుగుల చప్పుళ్ళు…
తీక్షణమైన చూపులు…
ఎరుపెక్కి సిద్ధంగా ఉన్నాయి!
ఇక అవ్వాలి విముక్తి దినం
అన్ని పీడనలకు చరమగీతం
ఏమాత్రం ఆపకు ఆనంద తాండవం
ఈ ఉదయం ఎన్నో రుధిరాల ఫలం
ఈ సమయం ఎన్నో కుత్తుకల స్వరం
బ్రతుకుదాం వాళ్ళలాగా-
సాహసంగా…
నిర్భయంగా…
గొప్పగా…
ఉన్నతంగా…
మన గుండెల్లోంచి మనవాళ్ళు
చూస్తున్నారు మనల్ని
మనలోని ధృతిని
నిజంగా ఇలాగే ఉందాం ఎప్పుడూ..!!
– రఘు వగ్గు

Leave a Reply