మన ఊరు మన బడి

మన ఊరు మన బస్తి బడి
సకల వసతులు మెరుగుపడి
అయ్యింది చదువులమ్మ ఒడి
పిల్లలను జ్ఞానులుగా మలచే మడి
ప్రభుత్వ బడిలో మొదటి అడుగు
బావి జీవితానికి పడుతుంది గొడుగు
తెలంగాణ ప్రభుత్వ బడులు
బావి భవితకు బంగారు సోపానాలు
పేద విద్యార్థులకు వరాలు
మన ఊరు మనబడి కార్యక్రమాలు
రేపటి పౌరులను తయారు చేస్తున్న
కర్మాగారాలు
ఆధునిక సాంకేతిక హంగులు
గ్రీన్ బోర్డులు సోలార్ జిలుగులు
త్రాగునీరు టాయిలెట్లు మధ్యాహ్న
భోజనం ఉచిత విద్యా వసతులు
డిజిటల్ తరగతులు కోరుకున్న
బోధన మాధ్యమాలు
నిష్ణాతులైన ఉపాధ్యాయులు
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
గుణాత్మక విద్యకు సంకేతం
నెరవేరుతున్న ప్రభుత్వ సంకల్పం!
(మన ఊరు-మన బస్తి బడి
ప్రారంభం సందర్భంగా)
– పి.బక్కారెడ్డి, 9705315250