Take a fresh look at your lifestyle.

“ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను..”

సూసైడ్‌ ‌నోట్‌ ‌రాసి కనిపించకుండా పోయని ఉద్యోగి
స్టీల్‌ ‌ప్లాంట్‌ ఉద్యోగి మాయంతో ఆందోళనలో తోటి కార్మికులు

‌నేను నా ప్రాణాన్ని ఉక్కు ఉద్యమం కోసం త్యాగం చేస్తున్నాను’ అని సూసైడ్‌ ‌నోట్‌ ‌రాసి, స్టీల్‌ ‌ప్లాంట్‌ ఉద్యోగి కనిపించకుండాపోయారు. దీంతో స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల్లో పనిచేస్తోన్న కార్మికులంతా అతని కోసం వెతుకుతున్నారు. శనివారం స్టీల్‌ప్లాంట్‌లోని శ్రీనివాస్‌ ‌బ్లాస్ట్ ‌ఫర్నేస్‌ ఇన్‌స్టుమ్రెంటేషన్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గాజువాకలోని సింహగిరి కాలనీకి చెందిన ఎస్‌. శ్రీ‌నివాసరావు అనే ఉద్యోగి ప్లాంట్‌లోని లాగ్‌బుక్‌లో సూసైడ్‌ ‌నోట్‌ ‌రాసి కనిపించకుండాపోయారు.

ఆ సూసైడ్‌ ‌నోట్‌లో.. ’ ప్రియమైన కార్మిక సోదరుల్లారా… మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం. ఈ రోజు జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి. 32 మంది ప్రాణ త్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేటుపరం కానివ్వద్దు. నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను.

ఈ రోజు కొలిమిలో అగ్నికి ఆహుతి కావడానికి 5 గంటల 49 నిమషాలకు మూహుర్తం ఉంది. కాబట్టి ఈ పోరాటంలో ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి. ఉక్కు ఉద్యమం విజయవంతానికి నా జీవితం అంకితం ’ అంటూ రాశారు. సూసైడ్‌ ‌నోట్‌ ‌చూసిన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులంతా ఎస్‌.శ్రీ‌నివాస్‌ ‌కోసం వెతుకుతున్నారు.

Leave a Reply