Take a fresh look at your lifestyle.

మ్యాన్‌ ‌హోల్‌లో చిక్కుకున్న.. కార్మికుడి కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

హైదరాబాద్‌ ‌హయత్‌నగర్‌ ‌సర్కిల్‌ ‌పరిధిలోని సాహెబ్‌ ‌నగర్‌ ‌మ్యాన్‌ ‌హోల్‌లో చిక్కుకున్న జీహెచ్‌ఎం‌సీ కార్మికుడు అంతయ్య కోసం రెస్క్యూ కొనసాగుతుంది. దాదాపు ముప్పై నాలుగు గంటలుగా రెస్క్యూ ఆపరేషన్‌ ‌కొనసాగుతుంది. అంతయ్య ఆచూకీ కోసం జీహెచ్‌ఎం‌సీ ఇంజనీరింగ్‌ ‌విభాగం నాలాను తవ్వుతుంది. ఇప్పటి వరకు ఘటనాస్థలానికి జీహెచ్‌ఎం‌సీ కమిషనర్‌, ‌మేయర్‌ ‌వెళ్లలేదు. ఇప్పటికే కార్మికుడు శివ మృతదేహాన్ని సిబ్బంది బయటకు తీసింది. శివ మృతదేహానికి నేడు ఉస్మానియా హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

రాత్రిళ్లు నాలాలోకి దింపడమే ప్రమాదానికి కారణం. కాంట్రాక్టర్‌ ‌స్వామిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజులు గడుస్తున్నా అంతయ్య కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాలాలో అంతయ్య కొట్టుకుపోయి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. నాలా పరివాహక ప్రాంతాలను జీహెచ్‌ఎం‌సీ సిబ్బంది జల్లెడ పడుతుంది. కుంట్లూరు చెరువు వరకు రెస్క్యూ ఆపరేషన్‌ ‌కొనసాగుతుంది. ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ‌పనులను పరీశీలించారు.

Leave a Reply