గోవుల రవాణాను అడ్డుకున్న వ్యక్తిపై కాల్పులు

– బాధితుడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పరామర్శ

ఘట్‌కేసర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : గోవులను తరలిస్తుండగా యువకులు అడ్డుకున్న సందర్భంగా తుపాకీతో కాల్పుల సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఘట్‌కేసర్‌ వద్ద గోవుల రవాణాను అడ్డుకునే సమయంలో కొందరు దుండగులు జరిపిన కాల్పులలో సోను(ప్రశాంత్‌) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతను ప్రస్తుతం సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు హాస్పిటల్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తిపై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిరచారు. బాధితుడి ఆరోగ్యం గురించి ఆయన ఆరా తీసి మెరుగైన వైద్యం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. బీజేపీ ఇలాంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *