నిరంతరం చదవండి ఎక్కువ కాలం జీవించండి అల్జీమర్స్‌ను నిరోధించండి
మెదడుకు సాన బెట్టండిలా…..
ఒక రోజు సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉదయాన్నే లేచి ఆఫీసుకు బయలుదేరుదామని సిద్దమయ్యాడు తీరా టై కనిపించడం లేదని లేదా వెహికిల్ కీ కనిపించడం లేదని భార్యపైకి చిందులు వేసే సంఘటనలు కోకోల్లలు.జేబులోనే పెన్ను ఉంటుంది కాని పెన్ను కోసం వెతికే వాల్లు కూడా ఉన్నారు. కిరాణం షాపులోకి వెల్లి ఏదైనా వస్తువులు కొంటే వెంటనే కాలిక్యులేటర్ తీసుకొని లెక్క చేసి డబ్బులు ఎంత ఇవ్వాలో చెబుతున్నాడు. నోటికి చేయాల్సిన చిన్న చిన్న లెక్కలకు కూడా కాలిక్యులేటర్ ను ఉపయోగిస్తూ తన మెదడు మొద్దు బారే విధంగా తయారు చేసుకుం టున్నాడు.
ఎందుకిలా జరుగుతోంది……
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి జీవితాలు, జీవన విధానాలలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని అరచేతి (మొబైల్ ఫోన్) లోనే వీక్షిస్తున్న మనిషికి అప్పుడప్పుడు విచిత్రమైన కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. సమయానికి గుర్తుకు రాని యూజర్ ఐడీలు, పాస్ వర్డ్ లు , సీక్రేట్ కోడ్ లతో మతి మరుపు వచ్చిందేమోనని అనుమానాన్ని కూడా మెదడు గుర్తు చేస్తుంది.
మనుషులకు దేవుడు ప్రసాదించిన అవయవమే మెదడు. మనిషీ జీవితం జ్ఞాపకాలతోటే గడిసిపోతుంది. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట, మన బంగారు భవిష్యత్తు కోసం వేసే ప్రతి అడుగు. రోజు చేసే పనులన్నీ జ్ఞాపకాలతో ముడిపడినవే. ఒకసారిగా మన పేరు, మనం ఉన్న ఊరు, మనతో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు మరిచిపోతే ఒక్కసారిగా ఊహించండి.
చివరికి మనల్ని మనమే మరచిపోతే…..
ఒకప్పుడు మతిమరుపు అనేది తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, నానమ్మలు, వృద్దులలో ఉండేది. కాని ఇది ప్రస్తుతం అందరిని వేధిస్తున్న సమస్య. విద్యార్థులకు పరీక్షలలో ప్రశ్నలకు జవాబులు గుర్తుకు రాక వేదనకు గురయ్యేవారెందరో, వాస్తవానికి గత దశాబ్దకాలం నుంచి గమనిస్తే మనం మెదడును పూర్తిస్తాయిలో వాడుకోవడం లేదనే చెప్పాలి. ప్రతి అవసరానికి ఏదో ఒక సాధనం మీద ఆధార పడుతూ మెదడు వాడకాన్ని పూర్తిగా తగ్గించేశాం. దీనివల్ల మెదడు పూర్తి స్తాయిలో పని చేయక డిమోన్షియా, అల్జీమర్స్ వంటి తీవ్ర మతి మరుపు సమస్యల ముప్పు పెరుగుతోంది.
బ్రతుకు సమరంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు:
ఎదురుగా ఉన్న వ్యక్తి పరిచయమే కాని అసలు గుర్తుకు రాకపోవడం, ఊరికి వెల్లి వస్తాం కాని మరల ఆ ఊరికి వెల్లాలంటే ఆ దారి అసలు గుర్తుకు రాకపోవడం, అప్పుడప్పుడు ఊర్ల పేర్లు, మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు మరచిపోతూ ఉండడం, చిన్నచిన్న లెక్కలకు కూడా కాలి క్యులేటర్ ను వాడడం, అంచనా వేయలే కపొవడం, సరైన నిర్ణయాలను తీసు కోలే కపోవడం, కారణం లేకుండానే భయం కలుగడం, కోపాన్ని ప్రదర్శించడం ఇలా బ్రతుకు సమరంలో చాలా సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటివి పెరిగి పెరిగి అల్జీమర్స్ తీవ్రతకు దారి తీస్తాయి. మాట్లాడిన మాటలే పదే పదే మాట్లాడుతూ ఉండడం, తర్వతా తర్వాతా ఇది ఒకటి రెండు రోజుల ముందు జరిగిన విషయాలు కూడ మరిచిపోవడం జరుగుతూ ఉండడానికి దారి తీస్తుంది.
నిద్ర మాత్రలతో అల్జీమర్స్ ముప్పు:
ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవన విధానంతో రాత్రిల్లు నిద్ర సరిగా రాకపోవడం, తెల్లవారి ఆఫీసులో టేబుల్ పైన నిద్ర పోతే బాస్ తో తిట్లు తప్పవని ఏదో ఒక పిల్ వేసుకుంటే నిద్ర పోవచ్చు కదా అని మాత్రలతో నిద్ర అలవాటుగా మారుతుంది. రోజు నిద్ర మాత్రలు వాడడం వల్ల అల్జీమర్స్ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గుర్తించాలి.
పాటించాల్సిన పద్దతులు:
ఒంటికాలు వ్యాయామం: ఏక పాదాసనం ఒక కాలు పై నిలబడి చేసే వ్యాయామాలు శరీర నియంత్రణకు, తూలి కింద పడకుండా ఉండటానికి జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండటానికి దోహదం చేసే నాడీ కణాలను ప్రేరేపిస్తాయి.
మానసిక వ్యాయామం:
మెదడుకు పదును పెట్టె పదకేళీలు, సుడోకు, లాజికల్ సమస్యల సాధన, పజిల్స్ , అబ్రివేషన్స్ గుర్తుకు తెచ్చుకోవడం, ద్యానం లాంటివి చేస్తూ ఉండాలి. కొత్త విషయాలు అన్వేశిస్తూ నేర్చుకోవడం: మెదడులో సమాచార ప్రసారం ఒక నాడీ కణం నుంచి మరో నాడీ కణానికి ప్రసరిస్తూ ఉంటుంది. కొత్త విషయాలతో నాడి కణాల మధ్య కొత్త బంధాలు ఏర్పడుతాయి. ఇలాంటి కొత్త బంధాలు మెదడును చురుకుగా తయారు చేస్తుంది. కొత్త బాష, సంగీతం, వంటలు… మొదలగునవి.
కొత్త వ్యక్తులతో పరిచయాలు:
మనకు మనమే ఏదో ఒక పనిని కల్పించుకొని దానిలో నిమగ్నం కావడం, కొత్త వ్యక్తులను కలవడం, పరిచయాలు, ఆలోచనా విధానాలలో మార్పు చేసుకోవడం, సాధారణంగా మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి వారినే కలుస్తూ ఉంటాం మంచిదే కాని ఇతర వృత్తుల వారినే కలిస్తే వైవిధ్య భరిత ఆలోచనలు వస్తాయి, కొత్త విషయాలు తెలుస్తాయి.
శారీరక వ్యాయామం:
రోజూ కనీసం అరగంట సేపు శారీరక వ్యాయామం చేస్తే శారీరక ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నిద్ర:
రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్ర పోవడం వల్ల జ్ఞాపకాలు స్తిర పడుతాయి. ఏకాగ్రత కుదురుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. పై వాటితో పాటుగా జ్ఞాపకశక్తి, ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించే జింక్, ఒత్తిడిని తగ్గించే మెగ్నిషియం, మూడ్ ని ఉత్సాహపరిచే సెరటోనిన్ అధిక మొత్తంలో లభించే గుమ్మడి గింజలు తీసుకోవాలి. అల్జీమర్స్ ఆలోచనలు, ప్రవర్తనలపై తీవ్ర ప్రభావంను చూపుతుంది.నిరంతరం చదవండి ఎక్కువ కాలం జీవించండి అల్జీమర్స్ ను నిరోధించండి.

రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్, 9703935321