Take a fresh look at your lifestyle.

మమత తిరిగి ఎన్నిక కావడం చారిత్రక అవసరం

బెంగాల్లో వొచ్చే మే లో జరిగే ఎన్నికల్లో తృణమూల్‌ ‌తృణముల్‌ ‌కాంగ్రెస్‌ ‌మెజారిటీ• ఇంత రాకపోయినా, తిరిగి అధికారంలోకి వొస్తుందని సీ- వోటర్‌• ‌సర్వేలో తేలింది.ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ పట్ల జనాదరణ తగ్గలేదనీ, 48 శాతం మంది ప్రజలు ఆమె నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఆ సర్వే తెలిపింది. మమతాబెనర్జీ తొందర పాటు నిర్ణయాలు , వాక్‌ ‌దోషం కారణంగా కొంత వ్యతిరేతను మూటగట్టుకున్నా, ప్రజల పట్ల ఆమె నిబద్ధతను ఎవరూ శంకించలేరు.ఆమె ప్రజల కోసం పోరాటమార్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయాల్లో ప్రవేశానికి ముందు ఆమె ప్రజా సమస్యలపైఅనేక పోరాటాలు సాగించారు.అందువల్ల అధికారంలోకి వొచ్చినా ఆమె అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఎదిరించే తత్వం ఆమెలో పాతుకుని పోయింది.ఆమె సహజంగా లౌకిక వాది. అయితే, మాజీ ప్రధాని వాజ్‌ ‌పేయి ఉదార విధానాలకు ఆకర్షితురాలై ఎన్‌ ‌డిఏలో చేరి ఆయన మంత్రివర్గంలో కొంతకాలం పాటుకొనసాగారు. బీజేపీలో అద్వానీ అనుకూల విధానాలనూ, ఆయన వర్గీయుల ధోరణులను ఆమె ఎన్నడూ సమర్ధించలేదు. గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ హయాంలో జరిగిన మతకలహాలను తీవ్రంగా ఖండించారు.ఆయనను తప్పించాలని డిమాండ్‌ ‌చేశారు.దాంతో మమతపట్ల మోడీ వ్యతిరేకత పెంచుకున్నారు.అదే ఇప్పటికీకొనసాగుతోంది. అదే కారణంపై ఆమె ఎన్‌ ‌డిఏ నుంచి బయటికి వొచ్చారు.

దేశంలో ఇప్పుడు నిజాయితీగా లౌకికవాదం కోసం పోరాడుతున్న అతి కొద్దిమందిలో ఆమె ఒకరు. ఆమెను తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు కమలనాథులు ఎన్నోప్రయత్నాలు చేశారు.ఇప్పటికీ చేస్తున్నారు. ఆమె కలిసి రాకపోవడం వల్ల దేశంలో ఏముఖ్యమంత్రికీ లేని ఇబ్బందులను సృష్టిస్తున్నారు. ఈ తరుణంలో ఆమెగెలిచి అధికారాన్ని చేపట్టడం బెంగాల్‌ ‌కే కాకుండా దేశంలో లౌకికశక్తులకు బలం చేకూరుతుంది. బెంగాల్‌ ‌స్వాతంత్య్రం రాకముందు నుంచి లౌకిక వాద శక్తులకు ఆటపట్టుగా ఉంది. వామపక్షాల కూటమి మూడున్నర దశాబ్దాల పాటు అక్కడ అధికారంలో కొనసాగడానికి అదే పునాది. బెంగాల్‌ ‌లో మతతత్వశక్తులకు స్థానం లేదని పూర్వపు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జ్యోతి బసు తరచూ స్పష్టం చేసేవారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఆ సంప్రదాయం కొనసాగింది. ఆతర్వాత ఆ పార్టీలో కూడా ఉదారవాదులు బయలుదేరి ఇతర పార్టీల విధానాలనుఅనుసరించడం వల్ల ప్రజలకు దూరమయ్యారు.హొ ఆ కూటమిని గద్దె దించేందుకు మమతాబెనర్జీహొహొ బీజేపీని ప్రోత్సహించారు.అదే ఇప్పుడు ఆమెకు యమపాశమె •కూర్చుంది. బీజేపీని బెంగాలీలు ఆదరిస్తున్నట్టు కమలనాథులు చెప్పుకుంటున్నప్పటికీ కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా నెరపుతున్న తంత్రాంగం కారణంగా అక్కడ బీజేపీలో చేరికలు పెరుగుతున్నాయి. వాపు ను చూసి బలుపు అనుకుంటున్నారు.నిజానికి అక్కడ లౌకికవాదులంతా కలిసి పని చేస్తే బీజేపీ ఒక్కసీటు కూడా రాదు.

- Advertisement -

మమతా బెనర్జీ పాలనలో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. దేశంలోఅవినీతి వ్యవస్థీకృతమైనప్పుడు కొద్దోగొప్పో అవినీతి ఆరోపణలు రాకుండా ఏపార్టీ ఉండదు.అయితే, ఆమె లౌకిక వాదం కోసం సాగిస్తున్న రాజీలేని పోరాటాన్నిదృష్టిలో ఉంచుకుని ఆమె మళ్లీ నెగ్గడం బెంగాల్‌ ‌కే కాకుండా దేశంలో లౌకిక శక్తులుబలపడటానికి చారిత్రక అవసరమని లౌకికవాద హితైషులు భావిస్తున్నారు. మోడీఅనుసరిస్తున్న విధానాలు దేశంలో అసంతృప్తిని పెంచుతున్నాయి. ఈ తరుణంలో లౌకిక వాదులు మోడీ వ్యతిరేకులతో చేతులు కలపాల్సిన అవసరం ఉంది. వాజ్‌ ‌పేయి మాదిరిగా మోడీ ప్రజల మనిషి కాదు. ఆయన కొన్ని శక్తులకు అనుకూలంగాపని చేస్తున్నారన్న విషయం రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చినప్పుడు రుజువైంది. నిరవధికంగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని నీరు గార్చేందుకుఆయన చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు. ఈ సమయంలో వాజ్‌ ‌పేయి ఉండి ఉంటే రైతులకున్యాయం జరిగేది అని అనుకున్నవారెంతో మంది ఉన్నారు. వాజ్‌ ‌పేయికూడా సంఘ్‌ ‌పరివార్‌ ‌భావజాలం నుంచి వొచ్చినా, ప్రజావ్యతిరేక విధానాలను ఎన్నడూ సహించేవారు కారు.

వాజ్‌ ‌పేయి ప్రజల కోసం మంచి నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి పేరిట ఆరు లైన్లు,నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణం మౌలిక సదుపాయాల పెంపు కోసం విమానాశ్రయాలు,రేవులను అభివృద్ది చేయడం వంటి ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు జేశారు. వాజ్‌ ‌పేయికీ, మోడీకి అసలు పోలికే లేదు. ఈ నేపధ్యం నుంచి ఆలోచిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో మమతా బెనర్జీ వంటి లౌకిక వాదులు బలపడటం ఎంతైనా అవసరం. ఆమెకుడి,ఎడమ భుజాలుగా అభివర్ణితులైన సుదీప్‌ ‌వంటి నాయకులను బీజేపీ ఇప్పటికే తనవైపు లాక్కుంది. బీజేపీ అక్కడ సాగిస్తున్న అరాచకాల గురించి స్థానికవార్తా ప్రసార సాధనాల్లో వొచ్చిన వార్తలు జాతీయమాద్యమాల్లో రావడం లేదు. మోడీకిప్రత్యామ్నాయంగా బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీశ్‌ ‌కుమార్‌ ‌ను నిలబెట్టాలని మమతప్రయత్నించారు. కానీ, ఆయన లో నిలకడ లేకపోవడం వల్ల సాధ్యం కాలేదు. ఆమెపై మోడీ కోపం పెంచుకోవడానికి అది కూడా ఒకకారణం. ఆమెను రాజకీయంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బకొట్టేందుకు కమలనాథులుప్రయత్నిస్తున్న వేళ ఆమెకు మద్దతు ఇవ్వడం అవసరమని లౌకికవాదులు భావిస్తున్నారు.

Leave a Reply