- ప్రభుత్వం ఏమైనా కార్పోరేట్ సంస్థనా?
- సిఎం కెసిఆర్ తీరుపై మండిపడ్డ మల్లుభట్టి విక్రమార్క
నష్టం వొస్తుందని ధాన్యం కొనుగోళ్లు ఎత్తేశామని సిఎం కెసిఆర్ అనడం దారుణమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏమైనా వ్యాపార సంస్థా అని ప్రశించారు. నష్టం వొస్తుంది కాబట్టి రైతుల పంటలు కొనుగోలు చేయను అంటే అది సీఎం మూర్ఖత్వమే అవుతుందన్న ఆయన.. రాష్ట్రం ఖజానాకు నష్టం వొచ్చిందని ఉద్యోగుల జీతాలు ఆపేస్తారా .? అని ప్రశ్నించారు. ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ కాదు… ఆ సంస్థకు నువ్వేవి• సీఈవో కాదు అంటూ.. కేసీఆర్‌పై మండిపడ్డారు.. ఇక, ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా ఈ నెల 9 ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు.
రైతులు దీక్ష చేస్తుంటే… కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదన్న ఆయన.. ప్రభుత్వ తీరు బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. టీఆర్ఎస్ కూడా రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు మల్లు భట్టి విక్రమార్క.. కానీ, ఢిల్లీ వరకు వెళ్లిన కేసీఆర్.. రైతులకు కనీస మద్దతు తెలపలేదన్న ఆయన.. ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చిన కేసీఆర్.. కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తున్నాం అని ప్రకటించి.. బాధ్యత నుండి తప్పించుకున్నారని మండిపడ్డారు.. సీఎం కేసీఆర్ అవగాహన లోపం వల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని… ప్రభుత్వం ధాన్యం కొనము అంటే దళారులు రైతులను పీడించడం మొదలుపెడతారన్న ఆయన.. రైస్ మిల్లర్లతో కుమ్మకై కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నారని ఆరోపించారు.