Take a fresh look at your lifestyle.

తెలంగాణతో లాభపడ్డది కెసిఆర్‌ ‌కుటుంబమే

  • దేశంలో రైతాంగాన్ని కార్పొరేట్‌ ‌కంపెనీలకు తాకట్టు పెట్టిన బిజెపి
  • హుజూరాబాద్‌లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి
  • ఎన్నికల ప్రచారంలో మల్లు భట్టి విక్రమార్క పిలుపు

తెలంగాణ వొచ్చాక లాభపడ్డది కేసీఆర్‌ ‌కుటుంబమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్‌ ‌దయతలచి రాష్ట్రం ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్‌నే విమర్శిస్తున్నారని అన్నారు. అసలు కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఇవ్వకుంటే కెసిఆర్‌, ‌కెటిఆర్‌ ఎక్కడ ఉండేవారని అన్నారు. హుజూరాబాద్‌ ‌ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకటనర్సింగ్‌రావుతో కలిసి బుధవారం భట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యులు లక్షల కోట్ల దోపిడీ చేస్తూ పదవులు అనుభవిస్తున్నారన్నారు. రాష్ట్రంలో దోపిడీ చేస్తున్నది టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలేనన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు మిరు ఎక్కువ అంటే మిరు ఎక్కువ దోపిడీ చేశారని ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్నారని, వారు పంచుకున్న సొమ్ముతో హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయన్నారు.

యువకుల ఉద్యోగాల కోసం కొట్లాడే విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని కోరారు. యువనాయకుడు గెలిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటాడని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్‌ ‌నియోజకవర్గ ప్రజలు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామిలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలోని రైతాంగాన్ని కార్పొరేట్‌ ‌కంపెనీలకు తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి లోపాయికారీగా కేసీఆర్‌ ‌మద్దతునిస్తున్నారని, అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్‌ ఉప ఎన్నికను సద్వినియోగం చేసుకోవాలని భట్టి కోరారు.

Leave a Reply