Take a fresh look at your lifestyle.

మళ్ళీ హైదరాబాదుకు..2

“మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించు కోలేదనుకుంటాను. ఆ నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలున్నారు. ప్రజా ఉద్యమం ఉంది. ప్రజా ఆకాంక్షలున్నాయి. రాజ్యాంగాన్ని ఈ నేపథ్యంలో చూడకపోవడం వల్ల ఒక రాజకీయ ప్రకటనగా దానికి ఉండవలసిన శక్తిని, పటుత్వాన్ని మనం విస్మరించాం. రాజ్యాంగాన్ని అలా గుర్తించకపోవడం వల్లనే. మన న్యాయస్థానాల తీర్పులు స్వాతంత్య్రోద్యమంతో, ఆ విలువలతో ఏమీ సంబంధం లేకుండా వెలువడడం మొదలైంది. సమానత్వం అనే సూత్రాన్ని రాజ్యాంగంలో, ప్రవేశికలోనే రాసుకున్నాం గాని దాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకోలేక పోయాం.”

అప్పుడే న్యాయవ్యవస్థలో కూడా మార్పులు రావడం మొదలయింది. తర్వాతి కాలంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా ప్రముఖులైన వి.ఆర్‌. ‌కృష్ణ అయ్యర్‌, ‌పి.ఎస్‌.‌భగవతి వంటి వాళ్ళు బేర్‌ ‌ఫుట్‌ ‌లాయర్స్, సామాన్యుడి ముంగిట్లోకి న్యాయం, చట్టమే ప్రజల దగ్గరికి పోవడం వంటి ఆలోచనలు ప్రకటిస్తున్నారు.రాజ్యాంగంలో ప్రకటించుకున్న ఉదాత్త లక్ష్యాలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థ నడవడం లేదని న్యాయవాదులు పెద్ద ఎత్తున ఆందోళన చెందడం మొదలయింది.

ఇది ఒక స్థాయిలో మోజుగా కూడా మారిపోయి, ప్రగతిశీల న్యాయవాదిగా పేరు తెచ్చుకోవడానికి యువ న్యాయవాదులలో వెంపరలాట కూడ మొదలయింది.దేశవ్యాప్తంగా న్యాయస్థానాలలో మొదలయిన ఈ సంచలనానికి తప్పని సరిగా రాజకీయ, సామాజికకారణాలున్నాయి.ప్రస్తావన వశాత్తూ ఆ రాజకీయ, సామాజిక కారణాల్ని నేను ఎన్నో చోట్ల వివరించాల్సి వచ్చింది. ఇక్కడ సందర్భానికి తగినవి చెప్పుకుంటే అవి నన్ను పౌర హక్కుల ఉద్యమం వైపు ఎట్లా నడిపించాయో అర్థమవుతుంది.

మనం మన రాజ్యాంగాన్ని పట్టించుకోవలసినంత తీవ్రంగా, గంభీరంగా పట్టించు కోలేదనుకుంటాను. ఆ నిర్లక్ష్యానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం. రాజ్యాంగం అనేది కేవలం ఒక చట్టపరమైన పత్రం కాదు. అది ఒక రాజకీయ ప్రకటన. దాని వెనుక ప్రజలున్నారు. ప్రజా ఉద్యమం ఉంది. ప్రజా ఆకాంక్షలున్నాయి. రాజ్యాంగాన్ని ఈ నేపథ్యంలో చూడకపోవడం వల్ల ఒక రాజకీయ ప్రకటనగా దానికి ఉండవలసిన శక్తిని, పటుత్వాన్ని మనం విస్మరించాం.

రాజ్యాంగాన్ని అలా గుర్తించకపోవడం వల్లనే. మన న్యాయస్థానాల తీర్పులు స్వాతంత్య్రోద్యమంతో, ఆ విలువలతో ఏమీ సంబంధం లేకుండా వెలువడడం మొదలైంది. సమానత్వం అనే సూత్రాన్ని రాజ్యాంగంలో, ప్రవేశికలోనే రాసుకున్నాం గాని దాన్ని సరైన పద్ధతిలో అర్థంచేసుకోలేకపోయాం.దేశ సమస్యలను సవ్యంగా అర్థం చేసుకోవడంలో, వ్యాఖ్యానించడంలో శిక్షణ పొందిన న్యాయవ్యవస్థ వైఫల్యం చెందింది.

రాజ్యాంగ రచన కన్న ముందే, స్వాతంత్య్ర ప్రకటన వెన్వెంటనే ఎస్‌.‌గోపాలన్‌ ‌మీద రాజద్రోహం కేసు, 1952లో మద్రాసు ప్రభుత్వానికీ చంపకం దొరైరాజన్‌ ‌కూ మధ్య నడిచిన కేసు మన స్వాతంత్య్రోద్యమ ఆదర్శాలకూ, వాస్తవ పాలనకూ మధ్య ఎంత వైరుధ్యం ఉన్నదో చూపెట్టాయి. ప్రివెంటివ్‌ ‌డిటెన్షన్‌ నిబంధనలు రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛకు పరిమితులు విధించాయి.

అసలు కొంచెం చరిత్రలోకి వెళ్తే  కోర్టును వలసవాద ప్రభుత్వం ఒక అణచివేత సాధనంగా తయారు చేసింది. ఆ వ్యవస్థ వలస పాలన కాలమంతటా అట్లాగే ఉండింది. స్వాతంత్య్రానంతరం ఆ వ్యవస్థ స్వభావాన్ని మార్చే దిశగా ఏ ప్రయత్నమూ జరగలేదు.

ఒక్క న్యాయవ్యవస్థ అని మాత్రమే కాదు, సామాజిక వ్యవస్థలలోనే ఎటువంటి  మార్పుల ప్రయత్నం జరగలేదు. జమీందార్లు, సంస్థానాధీశులు, రాజుల ఆస్తులను, సంపదలను స్వతంత్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. చేసుకున్న చోట్ల భారీ నష్ట పరిహారాలు చెల్లించింది. అధికార మార్పిడి వల్ల, వలస పాలన నుంచి రాజకీయ స్వాతంత్య్రం వల్ల ఈ దేశంలో దోపిడీ వర్గాలకు చిన్నఎత్తు నష్టం కూడా జరగలేదు. వాళ్ళు తరతరాలుగా ప్రజలను దోపిడీ చేసి కూడ బెట్టిన ఆస్తులు సమాజపరం కాలేదు సరిగదా, వాళ్ళు మంత్రులూ, పార్లమెంటు సభ్యులూ, శాసనసభ్యులూ అయ్యారు.స మసమాజం సాధించే లక్ష్యంతో జరిగిన పాలనా సంస్కరణలేవీ సమానత్వాన్ని సాధించలేకపోగా, అసమానతలను పెంచాయి. దేశంలో కొత్త భూస్వాములు పుట్టుకొచ్చారు.

దేశంలోని మౌలిక వ్యవస్థలు సామాజిక, పార్లమెంటరీ, రాజకీయ, న్యాయ-అన్నీ 1950ల నుంచీ కూడా దిగజారుడు దారిలో సాగుతున్నాయి. చట్టపరమైన వ్యవస్థలను, రాజకీయ వ్యవస్థలను కూలదోసే, విచ్ఛిన్నం చేసే పద్ధతిలో దుష్పరిపాలన సాగుతోంది. పార్లమెంటు దాని రాజకీయ కర్తవ్యాలను, బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమవుతూ వస్తోంది. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగానికి గురయింది. ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల ప్రచారం ప్రహాసనంగా మారిపోయాయి. రాజకీయ చర్చా సంప్రదాయం అడుగంటిపోయి, చర్చల స్థాయి దిగజారి పోయింది.

ఇటువంటి ప్రమాదాల గురించి సూచనలు, హెచ్చరికలు 1950ల నుంచే వెలువడు తున్నాయి. ఎం ఆర్‌ ‌రాధా అని తమిళ నటుడు ఉండేవాడు. ఆ రోజుల్లోనే రక్తకన్నీరు నాటకంలో ఒక డైలాగ్‌ ‌ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ‘‘కాంగ్రెస్‌ చాల తెలివయిన పార్టీ. కాంగ్రెస్‌లో గెలిస్తే మంత్రి కావచ్చు. ఓడిపోతే గవర్నర్‌ ‌కావచ్చు’’ అని.

అట్లా ఒక రాజకీయ పార్టీ తన రాజకీయాధికారాన్ని దుర్వినియోగం చేస్తే అంతిమంగా అది ఎంత సామాజిక అవ్యవస్థకు, దుష్పరిపాలనకు దారితీయ గలదో గత ఐదు దశాబ్దాల రాజకీయాలు రుజువు చేశాయి.

స్వాతంత్య్ర సాధన తర్వాత కొద్ది సంవత్సరాలు దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నట్టే కనబడింది. జమీందారీ వ్యవస్థ రద్దయింది. ప్రభుత్వరంగంలో భారీ పారిశ్రామిక, వ్యాపార సంస్థలెన్నో వచ్చాయి. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగింది. ఆర్థిక సౌభాగ్యం చేకూరబోతున్నదనే ఆశలు ప్రజల్లో వెల్లువెత్తాయి. అయినా రాజకీయ అసంతృప్తి ఏదో ఒక మూల కొనసాగుతూ వచ్చింది.

ఆ సామాజిక, రాజకీయ అసంతృప్తే మా తరానికీ, మా తర్వాతి తరానికీ కూడా ఆదర్శాలనందించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నా బాల్యంలో, చదువుకునే రోజుల్లో ఉండిన పేదరికం, న్యాయవాద వృత్తిలోకి వచ్చిన కొత్తలో సమాజమంతటా చెలరేగుతున్న అసంతృప్తి నన్ను ప్రభావితం చేశాయనిపిస్తుంది. నేను పౌరహక్కుల ఉద్యమంలోకి ఎట్లా వచ్చానో చెప్పేముందు ఈ ప్రభావాల గురించి మరికొంత చెప్పాలి.

చిన్నతనంలో నామీద ప్రభావం వేసిన వారిలో రాజప్ప, శేషాద్రిలతో పాటు మా అన్నయ్య రాంజీ గురించి చెప్పాలి. మేం రాంజీ అని పిలుచుకునే ఆయన పేరు కె.జి.రామనాథన్‌. ఆయన మద్రాస్‌లో తహసీల్దార్‌ ఆఫీసులో గుమస్తాగా పని చేసేవాడు. నెలకు ఐదు రూపాయల జీతం. నాకు మొట్టమొదటి చెప్పుల జత కొనిచ్చినవాడు ఆయనే. నన్ను అప్పుడప్పుడు బైటికి తీసుకెళ్ళి మసాలదోసె లాంటివేవో తినిపించేవాడు. బట్టలు ఆ రోజుల్లో మాకు రెండు జతలు సరిగ్గా ఉంటే గొప్ప.

ఆయన స్వభావం చిత్రంగా ఉండేదిముక్కు మీద కోపం ఉండేదికాని ఇతరులకు సాయపడడానికి ఎన్ని ఇబ్బందులైనా పడేవాడుఅందుకేననుకుంటాను ఎనభయవ పడిలో ఉన్నాఇప్పటికీ ఆయనను రోజూ పలకరించే మిత్రులు నలభై యాభై మంది ఉన్నారురాంజీ కొన్నాళ్ళకు తహసీల్దార్‌ ఆఫీసు వదిలేసి హిందుస్థాన్‌ ఇన్సూరెన్స్ ‌కంపెనీలో చేరాడు.1956లో దేశంలో ఇన్సూరెన్స్ ‌వ్యాపారం జాతీయకరణ జరిగి నప్పుడు ఆయన ఎల్‌..‌సి.లో భాగమై దాని ఉద్యోగుల ట్రేడ్‌యూనియన్నాయకు డయ్యాడుఇంటర్కూడా చదవలేదు గాని ఆయన నాయకుడుగా రాణించాడుఅఖిల భారత ఇన్సూరెన్స్ ఉద్యోగుల సంఘానికి దక్షిణ జోనల్కార్యదర్శి అయ్యాడుఅప్పుడు  సంఘానికి మోహనకుమార మంగళం అధ్యక్షుడునాకు కుమార మంగళం సన్నిహితమైంది మా రాంజీ ద్వారానే.

Leave a Reply