Take a fresh look at your lifestyle.

మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు కోర్డు ధిక్కరణ కేసు…

కలెక్టర్లకు జరిమానా, ఆర్డీవోకు జైలు శిక్ష హైకోర్టు సంచలన తీర్పు
కలెక్టర్లకు జరిమానా, ఆర్డీవోకు జైలు శిక్ష హైకోర్టు సంచలన తీర్పు

ప్రజాతంత్ర ప్రతినిధి హైదరాబాద్‌: ‌మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఇద్దరు కలెక్టర్లకు జరిమానా, ఒక ఆర్డీవోకు శిక్ష ఖరారు చేసింది. 2018లో మల్లన్నసాగర్‌ ‌ప్రాజెక్టు విషయంలో రైతుల అభ్యంతరాలను వినకుండా డిక్లరేషన్‌ ఇచ్చారని కొందరు బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో డిక్లరేషన్‌ను, అవార్డును రద్దు చేస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, 2019 మే నెలలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా అధికారులు మళ్లీ డిక్లరేషన్‌, అవార్డు ప్రకటించారని మరోసారి రైతులు కోర్టుకెక్కారు. బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం  సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామిరెడ్డి, సిరిస్లి జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌కు రూ. 2 వేల జరిమానా విధించింది. నాలుగు వారాల్లోగా జరిమానా మొత్తాన్ని చెల్లించని పక్షంలో నెల రోజుల పాటు జైలు శిక్ష విధించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, అలాగే, సిద్దిపేట ఆర్డీవో జయచందర్‌రెడ్డికి రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా సైతం విధించింది దీంతో పాటు కేసును దాఖలు చేసిన 12 మంది పిటిషనర్లకు రూ. 2 వేలు చొప్పున పరిహారంగా రైతులకు అధికారులు చెల్లించాలని ఆదేశించింద. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి గతంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వివరాలనూ రైతులకు తెలపాలనీ, వారి అభ్యంతరాలను పరిగనణలోనికి తీసుకోవాలనీ, విచారణ జరిపి ఆర్డర్‌ను రైతలకు ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

Tags: Fines for collectors, and Ardivo jailed High Court sensational judgment

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!