Take a fresh look at your lifestyle.

మల్కాజిగిరి ఎసిపి ఆదాయం రూ.50 కోట్లు

ఎసిబి దాడులతో అవినీతి బట్టబయలు
పలుచోట్ల అక్రమాస్తులను గుర్తించే పనిలో అధికారులు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గతంలో ఉప్పల్‌ ‌సీఐగా నరసింహారెడ్డి పని చేశారు. పలు ల్యాండ్‌ ‌సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో ఏసీపీ తల దూర్చినట్లు తెలుస్తోంది. నరసింహా
రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఆయన అనేక భూతగాదాల్లో తలదూర్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఏసీపీ నర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌, ‌మహేంద్రహిల్స్, ‌డీడీ కాలనీ, అంబర్‌పేట, ఉప్పల్‌, ‌వరంగల్‌లో 3 చోట్ల, కరీంనగర్‌లో 2 చోట్ల, నల్లగొండలో 2 చోట్ల, అనంతపూర్‌లో సోదాలు కొనసాగాయి. సికింద్రాబాద్‌ ‌నివాసంలో భారీగా బంగారు, వెండి ఆభరణాలను అధికారులు గుర్తించారు. 2008 నుంచి 2010 వరకు మియాపూర్‌లో సీఐగా పని చేసిన నరసింహారెడ్డి పలు భూవివాదాల్లో తలదూర్చి ఆస్తులు కూడబెట్టినట్లు తేల్చారు. ఉప్పల్‌, ‌మల్కాజ్‌గిరిల్లోనూ భూవివాదాల్లో ఏసీపీ తలదూర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ నరసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.

Leave a Reply