Take a fresh look at your lifestyle.

నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి

సూర్యాపేట, జూన్‌ 6, ‌ప్రజాతంత్ర ప్రతినిధి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి 2వ విడతలో భాగంగా రాష్ట్ర విద్యుత్‌ ‌శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొవడం జరిగిందని మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 24, 34, 38, 12, 42, 43వార్డుల్లో శనివారం మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌పి.రామాంజుల రెడ్డితో కలిసి కలియ తిరిగి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులను సత్వరమే పరిష్కరిం చాలని ఆదేశించారు.

ఈ సందర్భగా ఆమె మాట్లాడుతు వార్డుల్లో ఉన్న మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగిందని, ప్రజలకు అంటువ్యాధులు సోకకుండా నీరు నిల్వ ఉన్న ప్రదేశాలను, వస్తువులను శుభ్రం చేశామని అన్నారు. అలాగే ప్రజలు ఇంట్లో ఉండే కూలర్‌, ‌పగిలిన కుండలు వంటి వాటిల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పెరటి ఉన్న వారు మొక్కలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చూసుకోవాలని అన్నారు.రోడ్ల వెంట మురికి కాలువల ప్రక్కన ఉన్న పిచ్చి, కంప చెట్లను తొలగించాలని పారిశుద్ద్య సిబ్బందికి సూచించారు. దోమల నిర్మూలనకు ఆయ ప్రాంతాల్లో ఉన్న మురికి నీటిలో ఆయిల్‌ ‌బాల్స్‌ను వేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ ‌విక్రమ్‌, ‌లక్ష్మి జానీ యాదవ్‌, శ్రీ‌నివాస్‌, ‌రాధిక రమేష్‌, ‌నామ అరుణ ప్రవీణ్‌, ‌ప్రసాద్‌,‌హనుమంతరావు, శ్రీనివాస్‌, ‌సోమయ్య, వరుణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!