చెరువు కట్టల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్లతో సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్
చెరువులు మరియు కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్ధాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని సిఎస్ సోమెశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు సిఎస్ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై జిల్లా కలెక్టర్లతో శనివారం బిఆర్ కెఆర్ భవన్ నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఇంకా కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగనున్నందున జిల్లా అధికారులందరు హెడ్ క్వాటర్స్లోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించి ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు. జిల్లాల్లో రైల్వే లైన్లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ సూచించారు.
చెరువులు మరియు కుంటలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరకముందే చెరువు కట్టలను సంరక్షించడానికి తగు చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్ధితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు అయిందని ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్న (040-23450624)కు కాల్ చేయవచ్చని తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిఎస్ తెలిపారు. అదనంగా గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా కూడా వారు సూచించారు. డిజిపి మహేందర్ రెడ్డి, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, డిజాస్టర్ మేనేజ్ మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, హెల్త్ అండ్ ఫామిలి వెల్ఫేర్ కార్యదర్శి రిజ్వి, ఆర్ధిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ రఘునందన్ రావు, ఇరిగేషన్ శాఖ ఈఎన్సి మురళీధర్ రావు తదితర ఉన్నతాధికారులు ఈ టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.