Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువ కాన్పులు చెయ్యాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు నాణ్యత తో కూడిన వైద్యం అందించాలని కాన్పులు కూడా ఎక్కువ చేయాలని ప్రజలకు నమ్మకం భరోసా కల్పించాలని మహబూ బాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌విపీ గౌతం అన్నారు, గురువారం మండల కేంద్రం లోని పి హెచ్‌ ‌సి హాస్పిటల్‌ ‌లో డాక్టర్లు ఏఎన్‌ఎం ‌లతో కలిసి సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ ‌వ్యాధులు పట్ల జాగ్రత్తగా ఉండాలని పల్లెల్లో నిరంతరం పర్యటిస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ఏఎన్‌ఎం‌లు డాక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు, ఏఎన్‌ఎమ్‌ ‌లు గ్రామాల్లో పర్యటిస్తూ గర్భిణీల ను గుర్తించి ప్రతినెల వారికి సరైన వైద్యం అందేటట్లు చూడాలని అన్నారు, కరోనా వైరస్‌ ‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ,డాక్టర్లు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటిస్తూ సిబ్బందికి సూచనలు ఇవ్వాలని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సీజనల్‌ ‌పరంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు .

ముఖ్యంగా సీజనల్‌ ‌వ్యాధులు దగ్గు జలుబు జ్వరంలతో కూడిన విధంగా వస్తుంటాయని కరోనా వైరస్‌ ‌సోకిన వారికి కూడా ఇదే విధంగా లక్షణాలు ఉంటాయని వాటిని గమనిస్తూ వైద్యం చేయాలని ఆయన సూచించారు. హాస్పిటల్లో బలపాల ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో ఎన్నిడెలివరీలు చేశారని ఆయన వారిని అడిగి తెలుసుకున్నారు, డాక్టర్ల సమాధానం పై అసంతృప్తి వెలిబుచ్చారు, సిబ్బంది పనితీరు కూడా మెరుగుపరుచుకోవాలని లేని పక్షంలో చర్యలు తప్పవని అన్నారు, ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఅండ్‌ ‌హెచ్‌ ఓ ‌డాక్టర్‌ అం‌బరీష్‌, ‌తాసిల్దార్‌ ‌విజయ్‌ ‌కుమార్‌, ఎం‌పీడీవో ధన్‌ ‌సింగ్‌ ‌నాయక్‌, ‌డాక్టర్‌ ‌జితేందర్‌ ‌రెడ్డి, డాక్టర్‌ ‌శ్వేత, నూతక్కి నరసింహారావు, ఏఎన్‌ఎం‌లు, తదితరులు పాల్గొన్నారు,

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!