Take a fresh look at your lifestyle.

రైతువేదికలను సద్వినియోగం చేసుకోవాలి

  • సాగు పీటికి కొదువ లేకుండా చేశాం
  • విపక్షాలది అసత్మ ప్రచారం
  • సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కెటిఆర్‌

రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న రైతు వేదికలను రైతులంతా సద్వినియోగం చేసుకుని పంటల్లో మరింత దిగుబడి పెంచుకోవాలని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. బోయినిపల్లి మండలం కొదురుపాకలో నిర్మించిన రైతు వేదిక, నూతనంగా ఏర్పాటు చేసిన కెడిసిసి బ్యాంక్‌, ‌విలాసాగర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్‌ల ప్రారంభం, కొదురుపాకలో నాలుగు లైన్ల రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలను మంత్రి కెటిఆర్‌, ‌రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌, ‌రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లతో కలిసి చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి కెటిఆర్‌ ‌మాట్లాడుతూ మిడ్‌మానేరు తెలంగాణ రాష్ట్రానికి గుండె కాయమారిందని అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, సాగు నీటికి కొదువ లేకుండా చేశామని, దీనితో రాష్ట్రంలో ధాన్యం దిగుబడి రికార్డు స్థాయిలో జరిగిందని, రైతును రాజును చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడకుండా విపక్షాలు అసత్య ప్రచారానికి పాల్పడుతున్నాయని, ఈ విపక్ష నేతలకు ప్రజలంతా బుద్ది చెప్పి తీరుతారని అన్నారు. కొదురుపాక గ్రామంతో తనకు అనుబంధం ఉందని, ఈ గ్రామానికి రావడంతో తన చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ కొదురుపాకలో రైతు వేదిక ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌ ‌రోడ్డులో మిగిలిన రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో, నాప్కాబ్‌ ‌చైర్మన్‌ ‌కొండూరి రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ, బోయినిపల్లి మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply