Take a fresh look at your lifestyle.

అన్ని పరిశ్రమల్లోనూ తనిఖీలు చేయండి

  • ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలి
  • విశాఖ బాధిత గ్రామాల్లో మంత్రులు బసచేయాలి
  • ట్యాంకుల్లో స్టెరిన్‌ ‌తరలింపు పక్రియ ప్రారంభం
  • తిరిగి కొరియాకు 13వేల టన్నుల స్టెరెన్‌
  • ‌మంత్రుల,అధికారులతో సక్షలో సిఎం వైఎస్‌ ‌జగన్‌

అమరావతి,మే 11: విశాఖ గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటనలో బాధిత కుటుంబాల్లో భరోసా నింపాలని, షెల్టర్‌ ‌కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారిని వారి ఇళ్లకు చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఆదేవించారు. గ్రామాల్లో పూర్తి శానిటైజేషన్‌ ‌జరగాలన్నారు. ఈ ఘటననేపథ్యంలో ఒక్క విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోని మిగతా పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ప్రోటోకాల్స్ ‌తప్పనిసరిగా పాటించేలా చేయాలని ఆదేశించారు. అదే సమయంలో ప్రమాదకర పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలించే అంశంపైన కూడా ఆలోచనలు చేయాలన్నారు. విశాఖపట్నం గ్యాస్‌ ‌లీక్‌ ‌దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీల అభిప్రాయాలనుకూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవాలన్నారు. సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా సక్ష చేపట్టారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన, అవంతి శ్రీనివాస్‌, ‌కన్నబాబు, జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్‌ ‌కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ ‌సవాంగులు హాజరయ్యారు. అధి?కారులు గ్యాస్‌ ‌లీక్‌ ‌ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రికి తెలియజేశారు. సంఘటనా స్థలంలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. సాయంత్రం లోపు బాధితులను వారి ఇళ్లకు చేర్చాలని.. రాత్రికి ఆయా గ్రామాల్లోనే బస చేయాలని సీఎం జగన్‌ ‌మంత్రులను ఆదేశించారు. అంతకుముందు ఎల్జీ పాలిమర్స్ ‌గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం చెక్కుల పంపిణీ జరిగింది. మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌లు మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల చెక్కులను అందజేశారు. మొత్తం ఎనిమిది కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సహాయక చర్యలు, పరిహారంపై మంత్రులు, అధికారులుకు కీలక ఆదేశాలు జారీచేశారు. 3 రోజుల్లో మిగతా వారికీ ఆర్థిక సహాయం అందించాలన్నారు. కుటుంబాల్లోని చిన్నారులూ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రమాదకర పరిశ్రమల తరలింపుపైనా ఆలోచనలు చేయాలని, అన్ని కమిటీల నివేదకలూ పరిగణలోనికి తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటన, తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా మంత్రులు, అధికారులతో సీఎం సక్ష జరిపారు.

సక్లో మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ ‌నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌,‌సజ్జల రామకృష్ణారెడ్డి, విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్‌, ‌ధర్మాన కృష్ణ దాస్‌, ‌కలెక్టర్‌ ‌వినయ్‌చంద్‌, ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆర్కే నా తదితరులు పాల్గొన్నారు. గ్యాస్‌ ‌లీక్‌ ‌ఘటన, అనంతరం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు వివరాలు అందించారు. సీఎం ఆదేశించిన విధంగా మరణించిన కుటుంబాల్లో లీగల్‌ ‌హెయిర్‌ ‌ఫైనల్‌ అయిన 8 మందిలో 5 గురికి సాయం అందించారు. మిగిలి వారు నగరానికి దూరంగా ఉన్నందున వారికి కూడా అందిస్తామని మంత్రులు తెలిపారు. గ్రామాల్లో, ఇళ్లల్లో శానిటేషన్‌ ‌పనులు ప్రారంభమయ్యాయని, తర్వాత ప్రజలను ఊళ్లలోకి అనుమతిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపనారు. బాధితులు చాలామంది ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారని, ఎక్స్‌టర్నల్థ్ ‌శానిటేషన్‌, ఇం‌టర్నెల్‌ ‌శానిటేషన్‌పై నిపుణులు స్టాండర్ట్ ఆపరేషన్‌ ‌ప్రొసీజర్‌ ఇచ్చారు, దాని ప్రకారమే శానిటేషన్‌ ‌కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. మూడురోజుల్లో మిగతావారికీ ఆర్థిక సహాయం సీఎం ఆదేశాలిచ్చారు.

మంత్రులంతా.. ఆ 5 గ్రామాల్లో ఈ రాత్రికి బసచేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. శానిటేషన్‌ ‌కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రాత్రికి ఊళ్లోకి వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్యాస్‌లీక్‌ ‌ప్రభావిత గ్రామాల్లో ప్రతి మనిషికీ రూ.10వేలు ఇవ్వమని చెప్పారు. పిల్లలైనా, పెద్దలైనా.. అందరికీ పదివేల చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు వేసేందుకు వీలుగా ఉదయం వాలంటీర్లతో బ్యాంకు ఖాతాలు సేకరించాలన్నారు. ఆర్థిక సహాయం పొందేవారి జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని, ఎవరిపేరైనా కనిపించకపోతే వారు ఎలా పేరు నమోదుచేసుకోవాలో వారి వివరాలను అందులో ఉంచాలన్నారు. గ్యాస్‌లీక్‌ ‌ప్రభావిత గ్రామాల ప్రజలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం మూడు రోజుల్లో పూర్తికావాలన్నారు. గ్యాస్‌ ‌లీక్‌ ‌ప్రభావిత గ్రామాల ప్రజలకు వైద్యపరమైన సేవలకోసం క్లినిక్‌ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఆంధ్రా మెడికల్‌ ‌కాలేజీకి చెందిన వైద్యుల బృందాన్ని ఈ ప్రాంతంలోని వారికి వైద్య సేవలను అందించ డానికి నియమిస్తున్నామని కలెక్టర్‌ ‌వెల్లడించారు. లీకేజీ సంభవించిన ట్యాంకులో ప్రస్తుతం 73 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉం‌దని, సురక్షిత స్థాయిలో ఉందని కలెక్టర్‌ ‌తెలిపారు. ట్యాంకులోని స్టెరెన్‌ ‌కూడా దాదాపు 100శాతం పాలిమరైజ్‌ అయ్యిందని వెల్లడించారు.

Leave a Reply