Take a fresh look at your lifestyle.

కరోనా వైరస్‌తో మానవాళికి తీవ్ర ముప్పు

తీవ్రమైన అక్యూట్‌ ‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌ ‌వంటి వ్యాధులకు, సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి మిడిల్‌ ఈస్ట్ ‌రెస్పిరేటరీ సిండ్రోమ్‌ ‌వంటి వ్యాధులకు కారణమయ్యే కరోనా వైరసులు వైరస్‌ ‌కుటుంబంలోనే పెద్దవి. నావల్‌ ‌కరోనా వైరస్‌ అనేది(కొవిడ్‌-19) ఇం‌తకుముందు మానవులలో గుర్తించబడని ఒక కొత్త జాతి. ఈ కొత్త చైనాలోని హుబెయి ప్రావిన్స్, ‌రాజధాని ఊహన్‌లో మొట్టమొదటి సారిగా మానవులలో గుర్తించబడింది. ప్రజలలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా న్యూమోనియా వ్యాధి గుర్తించబడి, అభివృద్ధి అయినపుడు ఈ వైరస్‌ ‌కనుగొనబడింది. ప్రారంభంలో ఈ కేసులు చేపలు, కోడి మాంసం, మర్మోట్స్, ‌గబ్బిలాలు, విషపూరిత పాములు, కుందేళ్లు మరియు ఇతర జంతువులను విక్రయించే హువాన్‌ ‌సి ఫుడ్‌ ‌మార్కెట్‌తో అనుసంధానించబడ్డాయి. ఈ ప్రాణాంతకమైన నావల్‌ ‌కొరోనా వైరస్‌(‌కోవిడ్‌-19) ‌వ్యాప్తి వల్ల మానవులలో దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపిస్తాయి మరియు తీవ్ర ఇన్ఫెక్షన్‌, ‌న్యూమోనియా, మూత్రపిండాల వైఫల్యం కలిగి మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ వైరస్‌ ‌జంతువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా ఈ వైరస్‌ ‌మానవుల నుండి తుమ్మడం, దగ్గడం, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఎగువ శ్వాసకోశ లక్షణాలు ద్వారా మానవులకు సంక్రమిస్తుందని రుజువయింది.

రెండు నుండి పది రోజుల పొదిగే కాలం వుండే ఈ కరోనా వైరస్‌, ఆసియా పసిఫిక్‌ ‌ప్రాంతాలు, యూరోప్‌, ఉత్తర అమెరికా వంటి దేశాలలో ప్రారంభంలో అధిక కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం నావల్‌ ‌కరోనా వైరస్‌ ‌వ్యాధి నివారణకు చికిత్సగాని, టీకాలు గాని ఏమీ లేవు. చైనా శాస్త్రవేత్తలు ఈ నావల్‌ ‌కరోనా వైరస్‌ ‌జాతిని వేరు చేసి అనుమానిత రోగులలో దీని సంక్రమణను నిర్ధారించడానికి పాలిమరేజ్‌ ‌చైన్‌ ‌రియాక్షన్‌ను అభివృద్ధి పరచడానికి దాని జన్యుక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రయోగశాలలకు పంపించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ‌కూడా కరోనా వైరస్‌ ‌నిర్ధారణ పరీక్ష కొరకు నిర్వహణ నియమాలను ప్రచురించింది.

నివారణ – నియంత్రణ
నావెల్‌ ‌కరోనా వైరస్‌, ‌శ్వాస, దగ్గినప్పుడు బిందువుల ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకినా వ్యక్తి 90 నుండి 180 సెమీలోపు పరిధిలో వున్నపుడు ప్రధానంగా ఇది ఇతరులకు సంక్రమిస్తుంది. కరోనా వైరస్‌ ‌సంక్రమణ చికిత్స చేయడానికి ఔషధంగాని, వాక్సిన్‌ ‌గాని ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటి అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి నివారణ, నియంత్రణ కొరకు, సాధారణ సలహాలను అందించడం, ఫ్లూ కు సంబంధించిన మందులు ఇవ్వడం, ద్రవాలు త్రాగించడం, విశ్రాంతి తీసుకోవడం వంటి సలహాలను యూఎస్‌ ‌సూచించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసులు
చేతులను తరచుగా ఆల్కహాల్‌ ‌కలిగిన హ్యాండ్‌ ‌వాష్‌ / ‌సబ్బుతో కడగడం, సామాజిక దూరం పాటించడం, ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం వున్న వ్యక్తులనుండి కనీసం ఒక మీటర్‌ ‌దూరంలో ఉండడం, కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తగలకుండా ఉండడం, జ్వరం, దగ్గు, శ్వాసలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌ ‌సలహాలు తీసుకోవడం, ఇవేవీ లేనప్పటికీ తేలికపాటి శ్వాస కోశ లక్షణాలుంటే కోలుకునేంతవరకు ఇంటివద్దనే ఐసొలేషన్‌లో వుండండం, మాస్క్‌లను ధరించడం తద్వారా వైరస్‌ ‌వ్యాప్తి చెందకుండా చేయడం.

భూమిపై ఈ వైరస్‌ ఎం‌త కాలం జీవిస్తుందో ఖచ్చితంగా తెలియదు కానీ, ప్రాథ•మిక సమాచారం మేరకు కొన్ని గంటల వరకు జీవిస్తుంది. క్రిమి సంహారకాలు వినియోగించి ఈ ప్రాణాంతకమైన వైరస్‌ను ప్రజలలో ప్రబలకుండా అరికట్టడం కూడా కష్టమే. ఆంటిబయోటిక్స్ ‌కేవలం బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌పై• మాత్రమే పనిచేస్తాయి. కాని వైరస్‌పై• తమ ప్రభావాన్ని కలిగివుండవు. అందువల్ల నావల్‌ ‌కరోనా వైరస్‌ – 2019‌కు చికిత్స లేదు కనుక నివారణే మార్గం.

డా. చిందం రవీందర్‌
ఎం.ఎస్సి. ఎం.ఎడ్‌. ‌పిహెచ్‌.‌డి.
9390101091

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!