Take a fresh look at your lifestyle.

మహాత్మా.. మళ్లీ పుట్టాలి !

భారత జాతిపిత బాపూజీ !
మీ స్వప్న సౌధం శిధిలమైంది
ఆకాంక్షల సుమం వశివాడింది
ఆశయాల బాట బీటలుబారింది
అహింసా అస్త్రం తుప్పుపట్టింది
స్వేచ్చా భారతం  బంధీ అయింది

దశాబ్దాలు గడిచినా…
ప్రభుత్వాలు మారినా
దేశ స్థితి గతి మారలేదు
జాతి కన్నీటి తడి ఆరలేదు

ఏ మాటకు ఆ మాటే గాని
మీ జయంతి ,వర్ధంతులు
మొక్కుబడిగా జరుపుతున్నాం

అలనాటి…
నికార్సు సత్యాగ్రహాలు
సహాయ  నిరాకరణలు
ఆమరణ నిరాహార దీక్షలు
శాంతియుత సమరం చేసే
నిస్వార్థ నాయకులెవరు లేరు.
త్యాగదనుల ఎక్కడా కానరారు.

దేశం గూర్చి ఎవరికీ పట్టదు
మార్పు మాట అస్సలు గిట్టదు
ఎవరికి వారు యమునా తీరు వైనం

స్వార్థమే శ్వాసగా …
దోపిడే ధ్యేయంగా …
నయవంచనే లక్ష్యంగా…
అధికారమే పరమార్థంగా …
నిరంకుశ పాలన సాగుతోంది

ఓ మహాత్మా… !
మీరు మళ్లీ పుట్టుకు రావాలి
మరో సంగ్రామం సాగించాలి
నల్ల పాలకుల తరిమి కొట్టాలి
స్వేచ్చా భారతాన్ని ప్రతిష్టించాలి

(అక్టోబర్‌ 2 ‌న గాంధీ జయంతి సందర్భంగా…)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply