Take a fresh look at your lifestyle.

వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Mahashivaratri celebrations begin at Vemulavada

వేములవా డ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల కోసం అన్ని శాఖల సిబ్బంది తమకు కేటాయించ బడిన విధుల్లో చేరి సేవలను అందిస్తున్నారు.ఈ ఉత్సవాల కోసం ఆలయంతో పాటు వేములవాడను సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దారు.అయితే పక్షం రోజుల క్రితం మేడారం జాతర ముగియగా దానిలో పాల్గొన్న లక్షలాది భక్తులు అంతకు ముందే వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని వెళ్లారు.దీనితో వారంతా మహాశివరాత్రి ఉత్సవాల్లో పొల్గొనే అవకాశం చాలా తక్కువ.ఈ నేపథ్యంలో గురువారం రాత్రి వరకు 50 వేలకు పైగా   భక్తులు వేములవాడకు చేరుకున్నారు.శుక్రవారం ఉదయం నుండి రాత్రి వరకు మరో 2 లక్షల భక్తులు వేములవాడకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.శుక్రవారం ఉదయం నుండి రాజన్నగుడికి భక్తుల రాక అధికంగా ఉంటుందని ఆలయంలో తగిన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగానే రాష్ట్ర సాంస్క•తిక శాఖ వారు రూ కోటి వ్యయంతో చేపట్టిన శివార్చన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం 6.30 గంటలకు వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్‌ ‌రమేశ్‌   ‌ప్రారంభించారు.

Mahashivaratri celebrations begin at Vemulavada

ఈ శివార్చన గురువారం అర్ధరాత్రి వరకు నిర్వహించబడి,శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం ఉదయం 3 గంటల వరకు స్థానిక భక్తులు శ్రీస్వామివారికి అభిషేకం చేసే అవకాశాన్ని కల్పించడంతో వేలాది స్థానికులు రాత్రి 9 గంటల నుండే ధర్మగుండంలో స్నానాలాచరించి,క్యూలైన్లలో బారులు తీరారు.వీరంతా ఆలయంలోకి చేరుకుని శ్రీస్వామివారికి అభిషేకం చేసే సమయంలో మహామండపంలో రద్దీ అధికమైంది.ఈ రద్దీని క్రమబద్దీకరించడానికి సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా టిటిడి తరపును పట్టు వస్త్రాలను సమర్పించడానికి టిటిడి అర్చక బృందం గురువారం రాత్రి వేములవాడకు చేరుకుంది. వీరంతా శుక్రవారం ఉదయం 7 గంటలకు శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ ఉత్సవాలను ఎప్పటి కప్పుడు జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణభాస్కర్‌,‌బందోబస్తును ఎస్పీ రాహుల్‌ ‌హెగ్డేలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పర్యవేక్షిస్తూ సిబ్బందికి తగిన సూచనలిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply