Take a fresh look at your lifestyle.

బాబ్లీ గేట్లను ఎత్తిన మహారాష్ట్ర అధికారులు

నీటి విడుదలతో కిందకు వస్తున్న గోదావరి
దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు

నిజామాబాద్‌,‌జూలై1: మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. 120 రోజులపాటు గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్టాల్ర అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏటా జులై 1వ తేదీన ప్రాజెక్టు గేట్లు తెరవాలని.. అక్టోబర్‌ 28‌వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని 2013 ఫిబ్రవరి 28న సుప్రీంకోర్టు బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పువెలువరించిన విషయం తెలిసిందే. ఏటా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న మహారాష్ట్ర అధికారులు.. జులై 1వ తేదీ సందర్భంగా ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు, గ్రామ పంచాయతీలకు హెచ్చరికలు చేయడంతోపాటు ప్రజలందరికీ తెలిసేలా.. సైరన్‌.. ‌టామ్‌ ‌టామ్‌ ‌ద్వారా తెలియపరిచారు. బాబ్లీ గేట్ల ఎత్తివేతతో దాదాపు 1 టీఎంసీల నీరు దిగువ గోదావరిలో వస్తుందని అంచనా.

బాబ్లీ ప్రాజెక్టులో ప్రస్తుతం గేట్లు తెరిచే సమయానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 2.7టీఎంసీలు.  కాగా ప్రస్తుతం ఇన్‌ ‌ప్లో ఆశించిన స్థాయిలో లేదని అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ ‌వద్ద నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరి నదిలోకి విడుదలైన నీరు 80 కిలోటర్లు ప్రయాణించి తెలంగాణలోని ఎస్‌ఆర్‌ఎస్పీకి చేరుకుంటుంది. నిజామాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుబాటులో ఉంటుంది. గోదావరిలో వరద ప్రవాహం మొదలైనందున జాలర్లతోపాటు రైతులు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్‌ ‌జిల్లాలోని రెంజల్‌ ‌మండలం కందుకుర్తి త్రివేణి సంగమం వైపు నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో రైతులు, జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరంచారు.

బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌, ‌కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లాలోని ఆయకట్టుకు సాగునీరు అందనుంది. బాబ్లీ గేట్ల ఎత్తివేత, మూసివేత పక్రియలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ‌మహారాష్ట్ర అధికారులతో పాటు సీడబ్ల్యూసీ అధికారులు పాల్గొంటారు. బాబ్లీ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 2.7 టీఎంసీలు కాగా గురువారానికి ఒక టీఎంసీ నీటి నిల్వ ఉంద్గిగేట్లు ఎత్తితే గోదావరి ద్వారా నీరు ఎస్సారెస్పీలోకి చేరుతుంది.  గతేడాది బాబ్లీ ప్రాజెక్టులో సీజన్‌ ‌ప్రారంభంలోనే అత్యధిక వర్షాలు కురిసి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. వరద ఎక్కువ కావడంతో దిగువకు 14 గేట్లను క్రమంగా ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్టులో నీటి మట్టం ఆశించిన స్థాయిలో లేదు.

Leave a Reply